Telugu Global
Others

హార్దిక్ ప‌టేల్ క‌నిపించ‌డంలేదు

హార్థిక్‌ను హాజ‌రు ప‌ర‌చండి-గుజ‌రాత్ హైకోర్టు ప‌టేల్ సామాజిక‌వ‌ర్గానికి రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని డిమాండ్ చేస్తూ సాగుతున్న ఆందోళ‌న‌ల‌కు నేతృత్వం వ‌హించిన‌ హార్దిక్ పటేల్ కనిపించడం లేదు. దీనిపై హార్థిక్ ప‌టేల్ లోపాటు ఉద్య‌మంలో పాల్గొంటున్న దినేష్ ప‌టేల్ గుజ‌రాత్ హైకోర్టులో హెబియ‌ల్ కార్స‌స్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. హార్థిక్‌ను  పోలీసులు చట్ట విరుద్ధంగా అరెస్ట్ చేశారని  ఆయ‌న త‌ర‌పు న్యాయ‌వాదులు కోర్టుకు విన్న‌వించారు.దీనిపై  డివిజ‌న్ బెంచ్ జ‌డ్జిలు ఎంఆర్ షా, కేటీ థాక‌ర్‌లు విచార‌ణ జ‌రిపారు. హార్థిక్ ను […]

హార్దిక్ ప‌టేల్ క‌నిపించ‌డంలేదు
X
హార్థిక్‌ను హాజ‌రు ప‌ర‌చండి-గుజ‌రాత్ హైకోర్టు
ప‌టేల్ సామాజిక‌వ‌ర్గానికి రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని డిమాండ్ చేస్తూ సాగుతున్న ఆందోళ‌న‌ల‌కు నేతృత్వం వ‌హించిన‌ హార్దిక్ పటేల్ కనిపించడం లేదు. దీనిపై హార్థిక్ ప‌టేల్ లోపాటు ఉద్య‌మంలో పాల్గొంటున్న దినేష్ ప‌టేల్ గుజ‌రాత్ హైకోర్టులో హెబియ‌ల్ కార్స‌స్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. హార్థిక్‌ను పోలీసులు చట్ట విరుద్ధంగా అరెస్ట్ చేశారని ఆయ‌న త‌ర‌పు న్యాయ‌వాదులు కోర్టుకు విన్న‌వించారు.దీనిపై డివిజ‌న్ బెంచ్ జ‌డ్జిలు ఎంఆర్ షా, కేటీ థాక‌ర్‌లు విచార‌ణ జ‌రిపారు. హార్థిక్ ను ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఇవాళ కోర్టు ముందు హాజరు పరచాలని గుజ‌రాత్ పోలీసుల‌కు రాత్రి 2:30 గంటల సమయంలో ఆదేశాలు ఇచ్చారు.
అయితే, హార్దిక్ ను తాము అరెస్ట్ చేయలేదని పోలీసులు చెబుతున్నారు. అనుమతి లేకుండా సమావేశాలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై హార్దిక్ సహా 13 మందిపై కేసులు న‌మోదు చేశామ‌ని, ఆరావళీ జిల్లాలో ఆయన్ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా, తమ కళ్లు గప్పి పారిపోయారని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు హార్దిక్ ఎక్కడున్నారన్న విషయం ఆయన దగ్గరి మిత్రులు, పటేల్ నేతలకు సైతం తెలియకపోవడంతో గుజరాత్ లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రస్తుతం హార్దిక్ ఎక్కడున్నారో తెలియదని, ఆయన సమాచారం కోసం ప్రయత్నిస్తున్నామని న్యాయవాది బీఎం మంగూకియా వ్యాఖ్యానించారు. మరోవైపు కోర్టు ఆదేశాల‌తో పోలీసులు సైతం ఆయన కోసం గాలిస్తున్నారు.
First Published:  23 Sep 2015 2:20 AM GMT
Next Story