Telugu Global
Others

చంద్రబాబుకు ఇంకెంతకాలం 'కాపు'

2014లో జరిగిన ఎన్నికల్లో  తెలుగుదేశం పార్టీకి కాపు కాసి… చంద్రబాబునాయుడు అధికారంలోకి రావడానికి కారణమైన కాపులే ఇప్పుడు చంద్రబాబుపై తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారా? ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రతీ జిల్లాకు వచ్చి తాను అధికారంలోకొస్తే కాపుల చిరకాల స్వప్నమైన రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేసి… కాపులను బిసిలలో చేరుస్తానని ప్రకటించాడు. అంతే కాకుండా కాపు సామాజిక వర్గ అభివృద్ధికి ప్రతీ సంవత్సరం 1000 కోట్ల రూపాయలు కేటాయించండంతోపాటు… కాపులకు ఉప […]

చంద్రబాబుకు ఇంకెంతకాలం కాపు
X
nani2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కాపు కాసి… చంద్రబాబునాయుడు అధికారంలోకి రావడానికి కారణమైన కాపులే ఇప్పుడు చంద్రబాబుపై తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారా? ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రతీ జిల్లాకు వచ్చి తాను అధికారంలోకొస్తే కాపుల చిరకాల స్వప్నమైన రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేసి… కాపులను బిసిలలో చేరుస్తానని ప్రకటించాడు. అంతే కాకుండా కాపు సామాజిక వర్గ అభివృద్ధికి ప్రతీ సంవత్సరం 1000 కోట్ల రూపాయలు కేటాయించండంతోపాటు… కాపులకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇస్తానని హామి ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకొచ్చి 16 నెలలు గడిచిన ఇప్పటి వరకు కాపు రిజర్వేషన్ ప్రక్రియకు సంబంధించి కమిటీని కూడా వేయలేదు. కాపుల సంక్షేమ నిధికి ప్రతీ యేట 1000 కోట్లిస్తానన్న చంద్రబాబు …కేవలం 100 కోట్ల రూపాయలిచ్చి చేతులు దులుపుకున్నాడు. తన చెప్పుచేతల్లో ఉండే చినరాజప్పకి ఉపముఖ్యమంత్రి పదవిని కట్టపెట్టి… ఉత్సవ విగ్రహంగా ఉంచి చంద్రబాబు మరోసారి తన రాజకీయ చాణిక్యతను ప్రదర్శించాడు.
తెలుగుదేశంతో అమీతుమీ
గత ఎన్నికలలో కాపు సామాజిక వర్గానికి వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లనిచ్చినా… చంద్రబాబు మాయ మాటలు నమ్మి తెలుగుదేశం పార్టీకి సపోర్టు చేసి మోస పోయామని కాపు సామాజిక వర్గం భావిస్తుంది. తమకు ఏమి చేయడనే అభిప్రాయానికొచ్చిన కాపు నాయకులు చంద్రబాబుతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. గతనెలలో రాష్ట్రానికి చెందిన కాపు నాయకులంతా విజయవాడలో సమావేశమై… పార్టీలకతీతంగా కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులాందరు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. అందులో భాగంగానే వచ్చే నెలలో తూర్పు గోదావరి జిల్లాలో కాపుల ఐక్యతను తెలియజేసే విధంగా ఒక భారీ బహిరంగ సభను నిర్వహించి… ఈ సభ ద్వారా చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి కాపు సత్తా తెలియజేయాలని ఈ సామాజిక వర్గ నాయకులు భావిస్తున్నారు. విభజించి పాలించడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు కాపుల సభను జరగనిస్తాడో? కాపుల ఐక్యతకు గండి కొడతాడో వేచి చూడాలి.
– సవరం నాని
First Published:  23 Sep 2015 5:01 AM GMT
Next Story