Telugu Global
Cinema & Entertainment

నాని ముందు మహేష్‌, ఎన్టీఆర్‌ ఔట్‌..!

‘భలె భలే మగాడివోయ్‌’ వసూళ్ళు సృష్టించిన ప్రభంజనంలో జూనియర్‌ ఎన్టీఆర్‌, మహేష్‌బాబు రికార్డులు కొట్టుకుపోయాయి. ఓపినింగ్‌ కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ సినిమా మూడో వారం ముగిసే సరికి 1.36 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. రెండో వారాంతానికి ఈ సినిమా అక్క‌డ టాప్ వ‌సూళ్లు సాధించిన సినిమాల జాబితాలో 15వ స్థానంలో ఉండగా… మూడో వారాంతంలోకి టాప్ 9వ స్థానంలోకి దూసుకొచ్చింది. ఇప్పటివరకు యూఎస్‌లో ‘బాద్ షా’ 1.28 మిలియన్లు వసూళ్ళు సాధించగా, ఇండియాలో బాక్సాఫీస్‌ వద్ద […]

నాని ముందు మహేష్‌, ఎన్టీఆర్‌ ఔట్‌..!
X
‘భలె భలే మగాడివోయ్‌’ వసూళ్ళు సృష్టించిన ప్రభంజనంలో జూనియర్‌ ఎన్టీఆర్‌, మహేష్‌బాబు రికార్డులు కొట్టుకుపోయాయి. ఓపినింగ్‌ కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ సినిమా మూడో వారం ముగిసే సరికి 1.36 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. రెండో వారాంతానికి ఈ సినిమా అక్క‌డ టాప్ వ‌సూళ్లు సాధించిన సినిమాల జాబితాలో 15వ స్థానంలో ఉండగా… మూడో వారాంతంలోకి టాప్ 9వ స్థానంలోకి దూసుకొచ్చింది. ఇప్పటివరకు యూఎస్‌లో ‘బాద్ షా’ 1.28 మిలియన్లు వసూళ్ళు సాధించగా, ఇండియాలో బాక్సాఫీస్‌ వద్ద ఫెయిలైన మ‌హేశ్‌ సినిమా ‘వ‌న్- నేనొక్కడినే’ సినిమా 1.31 మిలియ‌న్లు డాలర్లు వసూలు చేసి అమెరికాలో రికార్డు నెలకొల్పింది. ఈ రెండు సినిమాల రికార్డులను ‘భలె భలె మగాడివోయ్‌’ సినిమా వసూళ్ళలో బీటవుట్‌ చేసింది. ఇపుడీ సినిమా 8వ స్థానంలో ఉన్న బన్నీ ‘రేసుగుర్రా’న్ని వెంటాడుతోంది. ఈ బంపర్‌ వసూళ్ళతో నాని మార్కెట్‌ ఒక్కసారిగా పెరిగిపోయినట్టు ఫిలింనగర్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు సినిమాకు కోటిన్నర తీసుకుంటున్న నాని ఇక నాలుగు కోట్లు డిమాండు చేసే అవకాశం ఉందని అంటున్నారు.
First Published:  23 Sep 2015 12:00 AM GMT
Next Story