Telugu Global
Others

ఏపీలో టీచర్లకూ బయోమెట్రిక్ అటెండెన్స్!

కొంత కాలంగా ఉద్యోగుల పట్ల మెతక వైఖరితో ఉంటూ వస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు ఇక తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా విద్యావస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. కలెక్టర్ల ముందు విద్యా వ్యవస్థలో లోపాలను ఎత్తిచూపిన బాబు.. పాఠశాలల్లో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు టీచర్లకు కూడా బయోమెట్రిక్ అటెండెన్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ముందుగా హైస్కూళ్లలో ఈ విధానం […]

ఏపీలో టీచర్లకూ బయోమెట్రిక్ అటెండెన్స్!
X

కొంత కాలంగా ఉద్యోగుల పట్ల మెతక వైఖరితో ఉంటూ వస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు ఇక తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా విద్యావస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. కలెక్టర్ల ముందు విద్యా వ్యవస్థలో లోపాలను ఎత్తిచూపిన బాబు.. పాఠశాలల్లో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు టీచర్లకు కూడా బయోమెట్రిక్ అటెండెన్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
ముందుగా హైస్కూళ్లలో ఈ విధానం ప్రవేశపెట్టి టీచర్లు పూర్తి సమయాన్ని పాఠశాలలోనే గడిపేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నిజానికి ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు అసలు పనే చేయరన్న ప్రచారం ఉంది. వచ్చినా పాఠాలు కాకుండా వ్యక్తిగత వ్యవహారాలు చూసుకుంటారన్న అపవాదు ఉంది. అందుకే బయోమెట్రిక్ విధానం అమలు చేయడంతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు.
బ‌యోమెట్రిక్ విధానంలో అటెండెన్స్ ను ఏర్పాటు చేయడం వల్ల టీచర్లు బాధ్యతగా పనిచేస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. స్కూళ్లలో ఏర్పాటు చేసే బయోమెట్రిక్ అటెండెన్స్ కేవలం జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారికే కాకుండా రాష్ట్రస్థాయిలో అనుసంధానం చేయడం ద్వారా హాజరు శాతాన్ని పెంచవచ్చని భావిస్తున్నారు. అంతేకాదు వారి పనితీరుకు మార్కులు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం మీద ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నేతలు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

First Published:  24 Sep 2015 7:13 AM GMT
Next Story