Telugu Global
Others

చంద్రబాబు కొత్త జిల్లాల రాజకీయం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఒక కీలక ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న ఈ ముఖ్య నిర్ణయం ఇంతవరకు మేధావులకుగాని, ముఖ్యమైన ప్రజాప్రతినిధులకుగాని తెలియదు. చంద్రబాబు ఈ మధ్య ఏ పని చేసినా ప్రజాస్వామ్య విలువలును కాలరాస్తూన్నట్లే కనిపిస్తుంది. ఉదాహరణకు ఎంతో కీలకమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని భూమి పూజకు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల నాయకులనుగాని మేధావులనుగాని ఆహ్వానించకుండా తన సొంత ఇంట్లో కార్యక్రమంలా ముగించేశాడు. అదేవిధంగా మరోసారి ఎవరితోనూ సంప్రదించకుండా రాష్ట్రంలో […]

చంద్రబాబు కొత్త జిల్లాల రాజకీయం!
X
naniఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఒక కీలక ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న ఈ ముఖ్య నిర్ణయం ఇంతవరకు మేధావులకుగాని, ముఖ్యమైన ప్రజాప్రతినిధులకుగాని తెలియదు. చంద్రబాబు ఈ మధ్య ఏ పని చేసినా ప్రజాస్వామ్య విలువలును కాలరాస్తూన్నట్లే కనిపిస్తుంది. ఉదాహరణకు ఎంతో కీలకమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని భూమి పూజకు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల నాయకులనుగాని మేధావులనుగాని ఆహ్వానించకుండా తన సొంత ఇంట్లో కార్యక్రమంలా ముగించేశాడు. అదేవిధంగా మరోసారి ఎవరితోనూ సంప్రదించకుండా రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను విభజించాలనే నిర్ణయానికి వచ్చి ఇప్పటికికే ఒక ప్రణాళికను తయారు చేయించుకున్నాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 13 జిల్లాలను విభజించి 24 జిల్లాలుగా మార్చాలన్నది చంద్రబాబు యోచన. ఈ ఆలోచనకు సంబంధించి వడివడిగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
చంద్రబాబునాయుడు రూపొందిస్తున్న ప్రణాళిక ప్రకారం విశాఖపట్నం జిల్లాను రెండుగా విభజించి… ఒక జిల్లాను విశాఖ జిల్లాగా, రెండో జిల్లాను అరకు కేంద్రంగా ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. ఇదే విధంగా తూర్పు గోదావరి జిల్లాను రెండుగా చేసి తూర్పు గోదావరి, సర్ ఆర్ధర్ కాటన్ జిల్లాలుగా… పశ్చిమ గోదావరిని రెండుగా చేసి పశ్చిమ గోదావరి, నరసాపురం జిల్లాలుగా… కృష్ణాను రెండుగా విభజించి కృష్ణా జిల్లా, ఎన్.టి.ఆర్ జిల్లాలుగా…. గుంటూరు జిల్లాను రెండుగా చేసి గుంటూరు, బాపట్ల జిల్లాలుగా…. ప్రకాశం జిల్లాను ప్రకాశం, మార్కాపురం జిల్లాలుగా…. అనంతపురం జిల్లాను అనంతపురం, హిందూపురం జిల్లాలుగా… చిత్తూరు జిల్లాను చిత్తూరు, బాలాజీ జిల్లాలుగా విభజించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను రచించింది. పరిపాలనా సౌలభ్యం కొరకు జిల్లాల సంఖ్యను పెంచడం మంచిదే గాని… ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు మేధావులతోను… వివిధ వర్గాల ప్రజలతోను చర్చించాలన్న ఆలోచన లేకపోవడమే ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడం. ప్రజాస్వామ్యబద్దంగా చేయాల్సిన పనులను కూడా మోనార్క్‌ తరహాలో చేయడం చంద్రబాబుకే చెల్లింది.
– సవరం నాని
First Published:  24 Sep 2015 10:20 AM GMT
Next Story