ట్రూజెట్ …ఫాల్స్ స‌ర్వీస్

నటుడిగానే కాకుండా వ్యాపార‌వేత్త‌గా కూడా రాణిస్తున్న రామ్‌చ‌ర‌ణ్‌కు ఎదురు`గాలి` ఆరంభ‌మైంది. మీరు అరిస్తే అరుపులు ..నేను అరిస్తే మెరుపులే వంటి సినిమా డైలాగుల‌తో వ‌య‌స్సుమించిన ఢాంబికాన్ని వెండితెర‌పై ప్ర‌ద‌ర్శించిన రామ్‌చ‌ర‌ణ్ ..విమానయాన‌రంగంలోకి అడుగుపెట్టి అట్ట‌ర్‌ఫ్లాప్ ఎదుర్కొంటున్నారు. ట్రూజెట్ పేరుతో మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడు ప్రారంభించిన విమాన స‌ర్వీసుల‌పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పేరు `ట్రూ`జెట్‌..అంతా ఫాల్స్ స‌ర్వీసు అని ప్ర‌యాణికులు వాపోతున్నారు.  డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గణాంకాల ప్ర‌కారం ఒక్క ఆగ‌స్టు నెల‌లో  అత్య‌ధిక ఫిర్యాదులు వ‌చ్చిన ఎయిర్‌లైన్స్‌గా రాంచ‌ర‌ణ్ ట్రూజెట్ స‌రికొత్త రికార్డు నెల‌కొల్పింది. ప్రారంభించిన అతికొద్ది నెల‌ల్లోనే ప్ర‌యాణికుల ఆగ్ర‌హానికి గురైన సంస్థ‌గా ట్రూజెట్ నిలిచింది. చెర్రీ సంస్థ‌కు చెందిన విమాన‌ సర్వీసులు ఏ మాత్రం బాగాలేవని ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌యాణికుల నుంచి వ‌చ్చిన ఫిర్యాదుల్లో  ట్రూజెట్ ఫ‌స్ట్‌ప్లేస్‌లో ఉండ‌గా, ఆ త‌రువాతి స్థానంలో ఎయిర్ ఇండియా ఆక్ర‌మించింది. ఆగ‌స్టు నెల‌లో సర్వీసుల రద్దు విషయంలోనూ ట్రూజెట్ ద్వితీయ‌స్థానంలో ఉంది. ఇందులో మాత్రం ఎయిర్ పెగాసెస్ కు ఫ‌స్ట్‌ప్లేస్ ద‌క్కింది.