జగన్ దీక్షను అడ్డుకోండి చూద్దాం: జ్యోతుల
తెలుగుదేశం ప్రభుత్వానికి దమ్మూ, ధైర్యం ఉంటే జగన్మోహన్రెడ్డి దీక్షను అడ్డుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జ్యోతుల నెహ్రూ సవాలు విసిరారు. రాష్ట్రానికి మేలు చేసే ఉద్దేశ్యంతో ప్రభుత్వం చేయలేని పనిని తమ నాయకుడు చేస్తుంటే ప్రోత్సహించడం మాని అడ్డుకునే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన నిలదీశారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో ఆయన మాట్లాడుతూ… నిరవధిక దీక్షను చేపడుతున్న జగన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యబద్దంగా చేసే కార్యక్రమాలను […]
BY sarvi24 Sep 2015 2:22 AM GMT
X
sarvi Updated On: 24 Sep 2015 2:22 AM GMT
తెలుగుదేశం ప్రభుత్వానికి దమ్మూ, ధైర్యం ఉంటే జగన్మోహన్రెడ్డి దీక్షను అడ్డుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జ్యోతుల నెహ్రూ సవాలు విసిరారు. రాష్ట్రానికి మేలు చేసే ఉద్దేశ్యంతో ప్రభుత్వం చేయలేని పనిని తమ నాయకుడు చేస్తుంటే ప్రోత్సహించడం మాని అడ్డుకునే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన నిలదీశారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో ఆయన మాట్లాడుతూ… నిరవధిక దీక్షను చేపడుతున్న జగన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యబద్దంగా చేసే కార్యక్రమాలను కూడా ఈ ప్రభుత్వం అడ్డుకుంటూ మిగిలిన రాజకీయ పార్టీలకు మనుగడ లేకుండా చేయాలని ప్రయత్నిస్తోందని ఆయన దుయ్యబట్టారు. అధికారం ఉంది కదాని ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. జగన్ దీక్షకు వేలాదిగా జనం తరలివస్తారని, ఆయన దీక్షను విజయవంతం చేయడానికి తామంతా ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. ‘జనం కోసం జననేత చేసే దీక్ష ఇది. అడ్డుకోవాలని చూస్తే ప్రజలే బుద్ధి చెబుతారు’ అని జ్యోతుల హెచ్చరించారు.
Next Story