Telugu Global
Cinema & Entertainment

 కృష్ణవంశీ కూడా మనసుపడ్డాడు

ఈమధ్య కాలంలో తెలుగులో క్రైమ్ కామెడీ సినిమాల సంఖ్య పెరిగింది. కాస్త హారర్ టచ్ ఉండే మాస్ మసాలాస్ బాగానే ఆడుతున్నాయి ఇక్కడ. అప్పుడెప్పుడో వచ్చిన ప్రేమకథాచిత్రమ్ నుంచి మొన్నొచ్చిన గీతాంజలి వరకు అన్నీ బాగానే ఆడాయి. త్వరలోనే శంకరాభరణం అంటూ మరో హారర్ కామెడీ కూడా రాబోతోంది. ఇవన్నీ చూసిన కృష్ణవంశీకి తను కూడా ఇలాంటి సినిమా చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన వెంటనే కథ సిద్ధం చేసుకున్నాడు. హారర్ ఎలిమెంట్స్ పెడుతూనే.. […]

 కృష్ణవంశీ కూడా మనసుపడ్డాడు
X
ఈమధ్య కాలంలో తెలుగులో క్రైమ్ కామెడీ సినిమాల సంఖ్య పెరిగింది. కాస్త హారర్ టచ్ ఉండే మాస్ మసాలాస్ బాగానే ఆడుతున్నాయి ఇక్కడ. అప్పుడెప్పుడో వచ్చిన ప్రేమకథాచిత్రమ్ నుంచి మొన్నొచ్చిన గీతాంజలి వరకు అన్నీ బాగానే ఆడాయి. త్వరలోనే శంకరాభరణం అంటూ మరో హారర్ కామెడీ కూడా రాబోతోంది. ఇవన్నీ చూసిన కృష్ణవంశీకి తను కూడా ఇలాంటి సినిమా చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన వెంటనే కథ సిద్ధం చేసుకున్నాడు. హారర్ ఎలిమెంట్స్ పెడుతూనే.. మధ్యమధ్యలో కామెడీ బిట్స్ యాడ్ చేశాడు. ఈ కథకు రుద్రాక్ష అనే టైటిల్ కూడా పెట్టాడు. నేరుగా తీసుకెళ్లి నిర్మాత దిల్ రాజుకు వినిపించాడు. ఇండస్ట్రీలో ఇప్పుడున్న ఛోటామోటా నటులతో ఈ సినిమా చేస్తే బాగుంటుందని ఓ ఉచిత సలహా కూడా పడేశాడు. దిల్ రాజుకు కూడా కథ నచ్చింది. అన్నీ వర్కవుట్ అయితే.. కృష్ణవంశీ నెక్ట్స్ సినిమా ఇదే కావొచ్చు.
First Published:  23 Sep 2015 7:07 PM GMT
Next Story