Telugu Global
Others

మోడీకి అడ్డం ఆయనొక్కరే!

భారత ప్రధాని నరేంద్ర మోడీ దూసుకుపోతున్నారు. రోజురోజుకు ప్రపంచ వ్యాప్తంగా తన ఫాలోయర్స్ ను పెంచుకుంటున్నారు. అంతర్జాతీయంగా నరేంద్రుడి ప్రతిష్ట పెరిగిపోతోంది. ముఖ్యంగా సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో మోడీ హవా మరింత పెరుగుతోంది. అది ఎంతగా అంటే ప్రపంచంలో అత్యధిక నెటిజన్ ఫాలోయర్స్ ఉన్న రాజకీయ నాయకుల్లో నరేంద్రమోడీ రెండవ వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఏ భారతీయ నాయకునికి ఈస్థాయిలో నెటిజన్ల ఆదరణ లభించ లేదు. ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ […]

మోడీకి అడ్డం ఆయనొక్కరే!
X

భారత ప్రధాని నరేంద్ర మోడీ దూసుకుపోతున్నారు. రోజురోజుకు ప్రపంచ వ్యాప్తంగా తన ఫాలోయర్స్ ను పెంచుకుంటున్నారు. అంతర్జాతీయంగా నరేంద్రుడి ప్రతిష్ట పెరిగిపోతోంది. ముఖ్యంగా సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో మోడీ హవా మరింత పెరుగుతోంది. అది ఎంతగా అంటే ప్రపంచంలో అత్యధిక నెటిజన్ ఫాలోయర్స్ ఉన్న రాజకీయ నాయకుల్లో నరేంద్రమోడీ రెండవ వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఏ భారతీయ నాయకునికి ఈస్థాయిలో నెటిజన్ల ఆదరణ లభించ లేదు.

ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్ లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రపంచంలోనే అత్యధిక ఫాలోయర్స్ తో మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. ఒబామాకు ఏకంగా 6కోట్ల 43లక్షల మంది ఫాలోయర్స్‌ ఉన్నారు. ఇక ప్రధాని మోడీ ఈ ఏడాది సెకండ్‌ ప్లేస్‌ కొట్టేశారు. ట్విట్టర్‌లో మోడీ ఫాలోయర్స్‌ సంఖ్య 15 మిలియ్లనకు చేరింది. అంటే ఆయనకు కోటీ 50 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారన్నమాట. ప్రస్తుతం అమెరికా పర్యటనలో మోడీ ఉండడంతో ఫాలోయర్స్ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

సామాజిక మాధ్యమాల్లో మెడీకి ఫాలోయింగ్‌ ఈనాటిది కాదు. గత ఎన్నికల నాటి నుంచే కొనసాగుతోంది. అయితే 2014 ఎన్నికల్లో బీజేపీ గెలుపులో మోడీ ప్రధాన పాత్ర పోషించడంతో ఆయనకు ఫాలోయర్స్ భారీగా పెరిగారు. మోడీ ట్విట్టర్ లో ఒక్క పిలుపు ఇస్తే లక్షల మంది సమాధానం ఇస్తూ వస్తున్నారు. మోడీ అనేకసార్లు తన మనసులో మాటను మీడియా ముందు కంటే ట్విట్టర్ లోనే ఎక్కువగా బయటపెడుతున్నారు. నేరుగా ప్రజలతోను, తన ఫాలోయర్స్ తోనూ పంచుకుంటున్నారు. మోడీ ప్రధాని అయిన ఏడాది కాలంలోనే ట్విట్టర్ అకౌంట్ కు 88లక్షల మంది ఫాలోయర్స్ అదనంగా వచ్చి చేరారు.

First Published:  24 Sep 2015 8:07 AM GMT
Next Story