Telugu Global
NEWS

లాభాల్లో సింగరేణి కార్మికులకు 21 శాతం వాటా

సింగరేణి కార్మికులపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వరాల జల్లు కురిపించారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో సంస్థ సాధించిన లాభాల్లో 21 శాతం వాటా కార్మికులకు చెల్లించాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. అలాగే సంస్థ కార్మికుల నుంచి వసూలు చేసే వృత్తి పన్ను (ప్రొఫెషనల్ టాక్స్) రద్దు చేయాలని, 1990 నుంచి బకాయిపడిన వృత్తిపన్ను రూ.175 కోట్లు కూడా రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో సింగరేణిపై నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం […]

లాభాల్లో సింగరేణి కార్మికులకు 21 శాతం వాటా
X
సింగరేణి కార్మికులపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వరాల జల్లు కురిపించారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో సంస్థ సాధించిన లాభాల్లో 21 శాతం వాటా కార్మికులకు చెల్లించాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. అలాగే సంస్థ కార్మికుల నుంచి వసూలు చేసే వృత్తి పన్ను (ప్రొఫెషనల్ టాక్స్) రద్దు చేయాలని, 1990 నుంచి బకాయిపడిన వృత్తిపన్ను రూ.175 కోట్లు కూడా రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో సింగరేణిపై నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన మొదటి ఏడాదిలో 2013-14 ఆర్థిక సంవత్సరంలో సంస్థ లాభాల్లో కార్మికుల వాటాను 20 శాతానికి పెంచిన సీఎం కేసీఆర్.. ఈ ఏడాది మరో శాతం అదనంగా చెల్లించాలని ఆదేశించారు. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 18 శాతం వాటా చెల్లించారు. 2014-15లో సింగరేణి యాజమాన్యం రూ.491 కోట్ల లాభాలను ఆర్జించింది. దీని ప్రకారం 21శాతం వాటాగా కార్మికులకు రూ.103.11 కోట్లు అందుతుంది. సంస్థలో పని చేస్తున్న 60 వేల మంది కార్మికులకు వ్యక్తిగతంగా రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు లబ్ది చేకూరనుంది.
First Published:  25 Sep 2015 2:25 AM GMT
Next Story