Telugu Global
Cinema & Entertainment

 బెంగాల్ టైగర్ ఫస్ట్ లుక్ అదుర్స్

కిక్-2 దెబ్బ నుంచి కోలుకునేందుకు, తన మార్కెట్ ను బ్యాలెన్స్ చేసుకునేందుకు వీలైనంత తొందరగా బెంగాల్ టైగర్ ను రంగంలోకి దింపాలని భావిస్తున్నాడు రవితేజ. నిజానికి ఈ సినిమా షూటింగ్ చాలా స్లోగా జరుగుతోంది. మాస్ రాజా సినిమా షూటింగ్ లు ఇంత నెమ్మదిగా జరగవు. కానీ అనుకోని కారణాల వల్ల మెల్లగా సాగుతున్న బెంగాల్ టైగర్ ప్రాజెక్ట్ కు సంబంధించి తాజాగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మెయిన్ క్యారెక్టర్లు పరిచయం చేయడంతో పాటు రవితేజ […]

 బెంగాల్ టైగర్ ఫస్ట్ లుక్ అదుర్స్
X
కిక్-2 దెబ్బ నుంచి కోలుకునేందుకు, తన మార్కెట్ ను బ్యాలెన్స్ చేసుకునేందుకు వీలైనంత తొందరగా బెంగాల్ టైగర్ ను రంగంలోకి దింపాలని భావిస్తున్నాడు రవితేజ. నిజానికి ఈ సినిమా షూటింగ్ చాలా స్లోగా జరుగుతోంది. మాస్ రాజా సినిమా షూటింగ్ లు ఇంత నెమ్మదిగా జరగవు. కానీ అనుకోని కారణాల వల్ల మెల్లగా సాగుతున్న బెంగాల్ టైగర్ ప్రాజెక్ట్ కు సంబంధించి తాజాగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మెయిన్ క్యారెక్టర్లు పరిచయం చేయడంతో పాటు రవితేజ ఫస్ట్ లుక్ ను విడుదల చేయడంతో సినిమా ఇప్పుడు రేసులోకి వచ్చినట్టయింది. మీరా పాత్రలో తమన్న ఫుల్ లెంగ్త్ గ్లామర్ రోల్ చేస్తోంది బెంగాల్ టైగర్ సినిమాలో. ఇక అత్తారింటికి దారేది సినిమాలో అల్టిమేట్ పెర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న బొమన్ ఇరానీ.. ఈ సినిమాలో అశోక్ గజపతి పాత్రలో మెప్పించనున్నాడు. ఈ పాత్రలకు సంబంధించిన లుక్స్ ను విడుదల చేయడంతో పాటు.. రవితేజ నయా స్టిల్ కూడా విడుదల చేశారు. అతడి క్యారెక్టర్ పేరు చెప్పకుండా.. కింద బెంగాల్ టైగర్ అనే టైటిల్ ను మాత్రం పెట్టి సినిమాపై అంచనాల్ని పెంచేశారు. ఈ సినిమాకు సంపత్ నంది దర్శకుడు.
First Published:  24 Sep 2015 10:00 PM GMT
Next Story