Telugu Global
National

భారత శ్రీమంతుడు ముఖేష్‌ అంబానీ

భారత్‌లోని అత్యంత సంపన్నుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్‌ అంబానీ తన ఆధిపత్యాన్ని కొనసాగించారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన తాజా కుబేరుల జాబితాలో 1890 కోట్ల డాలర్ల ఆస్తితో ముకేశ్‌కే మళ్లీ అగ్రస్థానం దక్కించుకున్నారు. ఫార్మా దిగ్గజ సంస్థ సన్‌ఫార్మా చైర్మన్ దిలీప్ సంఘ్వీ 1800 కోట్ల డాలర్ల సంపదతో రెండో స్థానాన్ని, విప్రో చీఫ్ అజీమ్ ప్రేమ్‌జీ 1590 కోట్ల డాలర్ల ఆస్తితో మూడో స్థానాన్ని, హిందూజా సోదరులు (1590 కోట్ల డాలర్ల ఆస్తి) నాలుగో […]

భారత శ్రీమంతుడు ముఖేష్‌ అంబానీ
X

mukeshభారత్‌లోని అత్యంత సంపన్నుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్‌ అంబానీ తన ఆధిపత్యాన్ని కొనసాగించారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన తాజా కుబేరుల జాబితాలో 1890 కోట్ల డాలర్ల ఆస్తితో ముకేశ్‌కే మళ్లీ అగ్రస్థానం దక్కించుకున్నారు. ఫార్మా దిగ్గజ సంస్థ సన్‌ఫార్మా చైర్మన్ దిలీప్ సంఘ్వీ 1800 కోట్ల డాలర్ల సంపదతో రెండో స్థానాన్ని, విప్రో చీఫ్ అజీమ్ ప్రేమ్‌జీ 1590 కోట్ల డాలర్ల ఆస్తితో మూడో స్థానాన్ని, హిందూజా సోదరులు (1590 కోట్ల డాలర్ల ఆస్తి) నాలుగో స్థానాన్ని, షాపూర్‌జీ పల్లోంజీ గ్రూపునకు చెందిన పల్లోంజి మిస్త్రీ(1470 కోట్ల డాలర్లు) ఐదో స్థానాన్ని దక్కించుకున్నారు. హెచ్‌సీఎల్ చైర్మన్ శివ్‌నాడార్, గోద్రేజ్ కుటుంబం, ఆర్సెలార్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సైరస్ పూనావాలా, ఆదిత్య బిర్లా గ్రూపు చైర్మన్ కుమార మంగళం బిర్లాకు వరుసగా 6 నుంచి 10 స్థానాలు దక్కాయి. జాబితాలోని కనీసం పది మంది సంపన్నుల ఆస్తి ఏడాది కాలంలో కనీసం 100 కోట్ల డాలర్ల మేర తగ్గిందని ఫోర్బ్స్ రిపోర్టు వెల్లడించింది. స్టీల్ టైకూన్ లక్ష్మీ మిట్టల్ 460 కోట్ల డాలర్ల ఆస్తితో 8వ స్థానానికి జారుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఆయన ర్యాంకింగ్ మూడు స్థానాలు తగ్గింది. ఫోర్బ్స్ రిచ్‌లిస్ట్‌లో అంబానీకి టాప్ ప్లేస్ దక్కడం ఇది వరుసగా తొమ్మిదోసారి.

First Published:  24 Sep 2015 8:51 PM GMT
Next Story