Telugu Global
Cinema & Entertainment

ఆడియో రిలీజ్ కు ముందే సాంగ్ హిట్

ప్రస్తుతం బ్రూస్ లీ అనే సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. ఈ సినిమాకు సంబంధించి రోజుకో వర్కింగ్ స్టిల్ టాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. మరోవైపు ఆడియో ను అక్టోబర్ 2న గ్రాండ్ గా విడుదల చేయాలని భావిస్తున్నారు మేకర్స్. అయితే అంతకంటే ముందే ఈ సినిమాలోని ఓ పాట సూపర్ సెన్సేషన్ అయింది. ఆడియో విడుదలకు ముందే ఆ సాంగ్ కేక పుట్టిస్తోంది. ఇదేదో నెట్ లో లీకైన సాంగ్ కాదు. స్వయంగా మేకర్స్ […]

ఆడియో రిలీజ్ కు ముందే సాంగ్ హిట్
X
ప్రస్తుతం బ్రూస్ లీ అనే సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. ఈ సినిమాకు సంబంధించి రోజుకో వర్కింగ్ స్టిల్ టాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. మరోవైపు ఆడియో ను అక్టోబర్ 2న గ్రాండ్ గా విడుదల చేయాలని భావిస్తున్నారు మేకర్స్. అయితే అంతకంటే ముందే ఈ సినిమాలోని ఓ పాట సూపర్ సెన్సేషన్ అయింది. ఆడియో విడుదలకు ముందే ఆ సాంగ్ కేక పుట్టిస్తోంది. ఇదేదో నెట్ లో లీకైన సాంగ్ కాదు. స్వయంగా మేకర్స్ రిలీజ్ చేసిన సాంగ్. అవును.. ఆ పాట ఇప్పుడు నెట్ లో లక్షన్నర వ్యూస్ సంపాదించుకుంది. దీంతో బ్రూస్ టీం అంతా పండగ చేసుకుంటోంది. మరోవైపు తాజాగా విడుదలైన టీజర్ కు కూడా లక్షన్నర హిట్స్ రావడంతో సినిమాపై బ్రూస్ లీ టీం నమ్మకం రెట్టింపయింది. ఇదే ఊపులో సినిమాను కంప్లీట్ చేసి, దసరా కానుకగా అక్టోబర్ 16న బ్రూస్ లీని థియేటర్లలోకి తీసుకురావాలనుకుంటున్నారు. శ్రీనువైట్ల డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాలో చెర్రీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. కృతి కర్బందా.. చరణ్ సిస్టర్ గా కనిపించనుంది. మరోవైపు ఇదే సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.
First Published:  24 Sep 2015 8:00 PM GMT
Next Story