Telugu Global
Cinema & Entertainment

సరికొత్త రికార్డు సృష్టించిన శ్రీమంతుడు

మహేష్ నటించిన శ్రీమంతుడు సినిమా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఓ సినిమా రెండు వారాలు ఆడడమే గగనంగా మారిన ఈ రోజుల్లో ఏకంగా 50 రోజులు కంప్లీట్ చేసుకుంది శ్రీమంతుడు మూవీ. అంతేకాదు.. రికార్డు బ్రేక్ చేస్తూ.. 185 సెంటర్లలో ఈ సినిమా 50 రోజులు పూర్తిచేసుకోవడం మరో విశేషం. భారీ బడ్జెట్ తో వచ్చిన బాహుబలి సినిమాతో సమానంగా శ్రీమంతుడు ఈ రికార్డు అందుకోవడం మరో విశేషం. ఈ సినిమా సాధించిన ఘన విజయానికి ఉబ్బితబ్బిపోయిన మహేష్.. […]

సరికొత్త రికార్డు సృష్టించిన శ్రీమంతుడు
X
మహేష్ నటించిన శ్రీమంతుడు సినిమా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఓ సినిమా రెండు వారాలు ఆడడమే గగనంగా మారిన ఈ రోజుల్లో ఏకంగా 50 రోజులు కంప్లీట్ చేసుకుంది శ్రీమంతుడు మూవీ. అంతేకాదు.. రికార్డు బ్రేక్ చేస్తూ.. 185 సెంటర్లలో ఈ సినిమా 50 రోజులు పూర్తిచేసుకోవడం మరో విశేషం. భారీ బడ్జెట్ తో వచ్చిన బాహుబలి సినిమాతో సమానంగా శ్రీమంతుడు ఈ రికార్డు అందుకోవడం మరో విశేషం. ఈ సినిమా సాధించిన ఘన విజయానికి ఉబ్బితబ్బిపోయిన మహేష్.. తాజాగా ఆ మూవీ దర్శకుడు కొరటాల శివకు.. ఓ లగ్జరీ కారును కూడా బహుమతిగా అందించాడు. గ్రామాల్ని దత్తత తీసుకోవడమే వినూత్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ తోపాటు సందేశాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు కొరటాల శివ.
First Published:  24 Sep 2015 7:02 PM GMT
Next Story