Telugu Global
Others

ఎర్రబస్సులెక్కే ఎం.పి.

ఈ బస్టాఫులో నిలుచున వాళ్లలో ఓ పెద్దాయన ఉన్నారు. ఆయనెవరో మీరు గుర్తుపట్టగలరేమో ఓసారి పరిశీలించండి? ఈ మనుషుల్ని గతంలో చూసినట్లు లేదే అనుకుంటున్నారా? ఈ మధ్యలో నిలుచున్న ఆ పెద్దమనిషి పేరు మిడియం బాబూరావు. బస్సుకోసం ఎదురుచూస్తున్న ఆయన డాక్టరు. గ్రామీణ వైద్యులు (ప్రైవేట్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్లు) కూడా సైకిళ్లు వదిలి బైక్‌లపై దూసుకుపోతున్న కాలంలో ఒక డాక్టరు ఆర్టీసీ బస్సు కోసం ఎదురుచూడ్డం ఏమిటని ఆశ్చర్యపోయేదేమీలేదు. ఆయన ప్రజా వైద్యుడు. కాసుల కోసం వైద్యం […]

ఎర్రబస్సులెక్కే ఎం.పి.
X

ఈ బస్టాఫులో నిలుచున వాళ్లలో ఓ పెద్దాయన ఉన్నారు. ఆయనెవరో మీరు గుర్తుపట్టగలరేమో ఓసారి పరిశీలించండి? ఈ మనుషుల్ని గతంలో చూసినట్లు లేదే అనుకుంటున్నారా? ఈ మధ్యలో నిలుచున్న ఆ పెద్దమనిషి పేరు మిడియం బాబూరావు. బస్సుకోసం ఎదురుచూస్తున్న ఆయన డాక్టరు. గ్రామీణ వైద్యులు (ప్రైవేట్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్లు) కూడా సైకిళ్లు వదిలి బైక్‌లపై దూసుకుపోతున్న కాలంలో ఒక డాక్టరు ఆర్టీసీ బస్సు కోసం ఎదురుచూడ్డం ఏమిటని ఆశ్చర్యపోయేదేమీలేదు. ఆయన ప్రజా వైద్యుడు. కాసుల కోసం వైద్యం చేయని డాక్టరు. పేదల కష్టసుఖాలు తెలిసన డాక్టరు. ఆశ్చర్యపోవాల్సిన విషయం ఒకటుంది. అదేమంటే? ఆయన మాజీ పార్లమెంట్‌ సభ్యుడు కూడా. పేదలకు వైద్యం చేసే మంచి డాక్టరుని భద్రాచలం లోక్‌సభ నియోజకవర్గ ప్రజలు ఆయనకిచ్చిన గౌరవం అంది. 14వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ఆయన సీపీఎం పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి, గెలిచారు. పార్లమెంట్‌ సభ్యుడిగానూ అంతే నిజయితీగా వ్యవహరించారు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనుకునే నేటి పొలిటీషియన్లకు భిన్నంగా నోరులేని ఆదివాసీల గొంతుకయ్యాడు. ఆదివాసీ హక్కుల కోసం చట్టసభల్లో ప్రశ్నించాడు. ఆదివాసుల హక్కుల కోసం ఉద్యమించాడు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల హక్కుల కోసం, పరిహారం కోసం పోరాడిండు. ఇప్పటికీ నోరులేని అడవి బిడ్డల హక్కుల కోసమే ఉద్యమిస్తున్నాడు. చోటా లీడర్లు కార్లు, ఖద్దరు చొక్కాలు, మందీమార్బలంతో తిరుగుతుంటే సీపీఎంలో నేతగా, ఒక ఎంపీగా పనిచేసిన ఆయన మాత్రం ఏ ప్రజలు తనను గెలిపించారో వాళ్లతోనే జీవిస్తున్నారు. వాళ్లలాగే జీవిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకుని బిడ్డల సౌఖ్యం కోసం, తరతరాలకూ తరగని ఆస్తులు కూడబెట్టలేదు. ప్రజలందరి సౌఖ్యం కోసం మాత్రమే రాజకీయాల్లో కొనసాగుతున్నారు. గొప్ప రాజకీయ జీవితం ఉన్నఈ మాజీ ఎంపీగారు ప్రచారాలకు (సొంత డబ్బాలకు దూరంగా) ఉంటారు. పావలా కోడికి ముప్పావలా మసాలా వేసినట్లు ఇసుమంత పనికి, కొండంత ప్రచారం చేసుకునే రాజకీయ నేతలకు భిన్నంగా ఉండే బాబూరావు అభినందనీయుడు. రాజకీయాల్లో నీతిమంతులు ఎక్కడున్నారండీ? అని నోరు పారేసుకునేముందు డాక్టర్‌ మిడియం బాబూరావు లాంటి నిజాయితీపరులు ఇంకా ఉన్నారని గుర్తుంచుకోండి.

First Published:  26 Sep 2015 1:03 AM GMT
Next Story