Telugu Global
CRIME

హిమాచల్‌ సీఎంపై అవినీతి కేసు నమోదు

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌పై అవినీతికి సంబంధించిన కేసు నమోదైంది. ఆయన అక్రమ ఆస్తులపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని సీబీఐతోపాటు ఆదాయ పన్ను శాఖను ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఆదేశించింది. ఈనేపథ్యంలో సీబీఐ బృందాలు శనివారం సీఎం వీరభద్ర సింగ్‌‌కు చెందిన 11 ప్రాంతాల్లోని నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. అనంతరం ఆయనపై అవినీతి ఆరోపణల కింద కేసు నమోదు చేశారు. కేంద్రంలో మంత్రిగా పనిచేసిన కాలంలో వీరభద్ర సింగ్ అవినీతికి పాల్పడ్డారని సిబిఐ అభియోగం, […]

హిమాచల్‌ సీఎంపై అవినీతి కేసు నమోదు
X
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌పై అవినీతికి సంబంధించిన కేసు నమోదైంది. ఆయన అక్రమ ఆస్తులపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని సీబీఐతోపాటు ఆదాయ పన్ను శాఖను ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఆదేశించింది. ఈనేపథ్యంలో సీబీఐ బృందాలు శనివారం సీఎం వీరభద్ర సింగ్‌‌కు చెందిన 11 ప్రాంతాల్లోని నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. అనంతరం ఆయనపై అవినీతి ఆరోపణల కింద కేసు నమోదు చేశారు. కేంద్రంలో మంత్రిగా పనిచేసిన కాలంలో వీరభద్ర సింగ్ అవినీతికి పాల్పడ్డారని సిబిఐ అభియోగం, సుమారు ఆరు కోట్ల మేర ఆదాయాన్ని మించి ఆస్తులు సమకూర్చుకున్నారని సిబిఐ ఆరోపిస్తోంది. వీరభద్రసింగ్ భార్య, కుమారుడు, కుమార్తెలపై కూడా సిబిఐ కేసులు పెట్టింది. హిమాచల్ ప్రదేశ్‌లోను, ఢిల్లీలోను ఏకకాలంలో పదకుండు చోట్ల సిబిఐ దాడులు చేసింది. ఒక ముఖ్యమంత్రి నివాసంపై ఇలా దాడులు చేయడం ఆరుదు. 80 సంవత్సరాల వయసున్న వీరభద్ర సింగ్ సుదీర్ఘకాలం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు.
First Published:  25 Sep 2015 3:06 PM GMT
Next Story