Telugu Global
Others

పాలు, కూరగాయలమ్మి బతుకుతున్నాం: లోకేష్‌

తన తల్లి పెట్టిన హెరిటేజ్‌ సంస్థ ద్వారానే తాము జీవిస్తున్నామని, ఈ సంస్థ లాభాలు సంపాదిస్తుందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ తెలిపారు. 1992లో నెలకొల్పిన హెరిటేజ్‌ ద్వారానే తమకు ఆదాయం వస్తుందని, పాలు, కూరగాయల వ్యాపారంతోనే బతుకుతున్నామని ఆయన తెలిపారు. మూడు లక్షల మంది రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నామని, ఈ సంస్థ విక్రయాలు రూ. 2073 కోట్లని, ఖర్చులు, పన్నులు పోను రూ. 30 కోట్ల లాభం […]

పాలు, కూరగాయలమ్మి బతుకుతున్నాం: లోకేష్‌
X
తన తల్లి పెట్టిన హెరిటేజ్‌ సంస్థ ద్వారానే తాము జీవిస్తున్నామని, ఈ సంస్థ లాభాలు సంపాదిస్తుందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ తెలిపారు. 1992లో నెలకొల్పిన హెరిటేజ్‌ ద్వారానే తమకు ఆదాయం వస్తుందని, పాలు, కూరగాయల వ్యాపారంతోనే బతుకుతున్నామని ఆయన తెలిపారు. మూడు లక్షల మంది రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నామని, ఈ సంస్థ విక్రయాలు రూ. 2073 కోట్లని, ఖర్చులు, పన్నులు పోను రూ. 30 కోట్ల లాభం వచ్చిందని ఆయన చెప్పారు. హెరిటేజ్‌ సంస్థను అమ్మ, బ్రహ్మణి నడిపిస్తున్నారని, వ్యాపార సూత్రాలకు అనుగుణంగా హెరిటేజ్ సంస్థను నిర్వహిస్తున్నామని లోకేష్ తెలిపారు. హెరిటేజ్‌ సంస్థకు జాతీయ అవార్డులు కూడా వచ్చాయన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులను ప్రకటించారు. తన తండ్రి చంద్రబాబుకు రూ. 42.40 లక్షలు, తల్లి భువనేశ్వరికి రూ. 33.07 కోట్లు, తనకు రూ. 7.67 కోట్లు, భార్య బ్రహ్మణికి రూ. 4.77 కోట్లు ఆస్తులున్నట్లు తెలిపారు. ఇవన్నీ తాము కొన్నప్పటి ఆస్తుల విలువ అని ప్రకటించారు. కొందరు నేతలు రాజకీయాలను అవినీతిమయంగా మార్చారని, తాము గత ఐదేళ్లుగా ఆస్తులను ప్రకటిస్తున్నామని… అన్ని రాజకీయ పార్టీలు, నేతలు ఆస్తులను ప్రకటిస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీ కోసం న్యూస్‌ చానెల్‌ పెట్టాలనే ఆలోచన తమకు లేదని నారా లోకేష్‌ వెల్లడించారు.
First Published:  26 Sep 2015 3:34 AM GMT
Next Story