Telugu Global
Others

ప్ర‌మోష‌న్ లిస్టులో ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి

రాష్ట్ర స‌మాచార‌, ఐటి శాఖ మంత్రి డా. ప‌ల్లె ర‌ఘునాధ‌రెడ్డికి త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో మంచి పోర్టుఫోలియో వ‌స్తుంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం స‌మాచార‌, ఐటి, మైనార్టీసంక్షేమం, తెలుగు, ఎన్ఆర్ఐ, సాంస్కృతిక శాఖల బాధ్య‌త‌లు స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హిస్తున్న ప‌ల్లె ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు దృష్టిలో బాగా ప‌నిచేస్తున్న మంత్రిగాపేరు సంపాదించారు. ఇటీవ‌ల క్యాబినేట్ భేటీలో కూడా తోటి మంత్రుల స‌మ‌క్షంలో ఐటి శాఖ ప‌నితీరుపై ప‌ల్లె ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జేంటేష‌న్ ఇచ్చిన స‌మ‌యంలో  సీఎం అంద‌రి ముందు […]

ప్ర‌మోష‌న్ లిస్టులో ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి
X

రాష్ట్ర స‌మాచార‌, ఐటి శాఖ మంత్రి డా. ప‌ల్లె ర‌ఘునాధ‌రెడ్డికి త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో మంచి పోర్టుఫోలియో వ‌స్తుంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం స‌మాచార‌, ఐటి, మైనార్టీసంక్షేమం, తెలుగు, ఎన్ఆర్ఐ, సాంస్కృతిక శాఖల బాధ్య‌త‌లు స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హిస్తున్న ప‌ల్లె ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు దృష్టిలో బాగా ప‌నిచేస్తున్న మంత్రిగాపేరు సంపాదించారు. ఇటీవ‌ల క్యాబినేట్ భేటీలో కూడా తోటి మంత్రుల స‌మ‌క్షంలో ఐటి శాఖ ప‌నితీరుపై ప‌ల్లె ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జేంటేష‌న్ ఇచ్చిన స‌మ‌యంలో సీఎం అంద‌రి ముందు ర‌ఘునాథ‌రెడ్డి ప‌నితీరును మెచ్చుకున్నారు. మంత్రులు, వారి శాఖ‌ల ప‌నితీరును ఎప్ప‌టిక‌ప్పుడు బేరీజు వేసి ర్యాంకింగ్స్ ఇస్తుంటారు చినబాబు లోకేష్‌…ఈ ర్యాంకింగ్స్‌లోనూ ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి 4వస్థానంలో ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో అక్టోబ‌రులో జ‌రుగుతుంద‌ని భావిస్తున్న రాష్ట్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ప‌ల్లెకు ఐటి, ఐ అండ్ పిఆర్ కు అద‌నంగా టూరిజంగానీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌గానీ సీఎం అప్ప‌గించ‌డానికి సిద్ధ‌మైన‌ట్లు ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ స‌మాచారం.

కార్య‌క‌ర్త‌ల‌కు నిత్యం అండ‌గా ఉంటూ, నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు ఏ క‌ష్ట‌మొచ్చినా వెంట‌నే అక్క‌డికి వెళ్లి సొంత డ‌బ్బుల‌తో స‌హాయ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టే ప‌ల్లె, ఇప్ప‌టికే మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒక‌సారి ఎమ్మెల్సీగా గెలిచారు. అవినీతి మ‌కిలి అంట‌ని ముగ్గురు, న‌లుగురు మంత్రుల్లో ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి కూడా ఒక‌రని తెలుస్తోంది. మొద‌టిసారి మంత్రిప‌ద‌వి వ‌చ్చినా, ఆరు శాఖ‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించ‌డంతో ముఖ్య‌మంత్రి ప‌ల్లెకు ప్ర‌మోష‌న్ ఇవ్వాల‌ని డిసైడ్ అయిపోయార‌ని స‌మాచారం.

First Published:  26 Sep 2015 1:25 AM GMT
Next Story