Telugu Global
Cinema & Entertainment

ఎవడో ఒకడు అంటున్న రవితేజ

రవితేజ సినిమాలన్నీ మాస్ మసాలాస్ తో దట్టించి ఉంటాయి. ఈమధ్యే కిక్-2 సినిమాను విడుదల చేసిన మాస్ రాజా.. త్వరలోనే బెంగాల్ టైగర్ ను విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. ఈ సినిమా ఇంట్రడక్షన్ పోస్టర్లు కూడా ఈమద్యే విడుదలయ్యాయి. ఇప్పుడు మరో డిఫరెంట్ టైటిల్ తో మనముందుకొస్తున్నాడు రవితేజ. రవితేజ నెక్ట్స్ సినిమాకు ఎవడో ఒకడు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. గతంలో సిద్దార్థ్-శృతిహాసన్ లను హీరోహీరోయిన్లుగా పెట్టి ఓ మై ఫ్రెండ్ సినిమా తీసిన వేణుశ్రీరామ్ […]

ఎవడో ఒకడు అంటున్న రవితేజ
X
రవితేజ సినిమాలన్నీ మాస్ మసాలాస్ తో దట్టించి ఉంటాయి. ఈమధ్యే కిక్-2 సినిమాను విడుదల చేసిన మాస్ రాజా.. త్వరలోనే బెంగాల్ టైగర్ ను విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. ఈ సినిమా ఇంట్రడక్షన్ పోస్టర్లు కూడా ఈమద్యే విడుదలయ్యాయి. ఇప్పుడు మరో డిఫరెంట్ టైటిల్ తో మనముందుకొస్తున్నాడు రవితేజ. రవితేజ నెక్ట్స్ సినిమాకు ఎవడో ఒకడు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. గతంలో సిద్దార్థ్-శృతిహాసన్ లను హీరోహీరోయిన్లుగా పెట్టి ఓ మై ఫ్రెండ్ సినిమా తీసిన వేణుశ్రీరామ్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ దర్శకుడికి ఇప్పటివరకు ఒక్క హిట్ లేనప్పటికీ.. అతడు చెప్పిన స్టోరీలైన్ నచ్చి రవితేజ నటించడానికి ఒప్పుకున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రాబోతోంది. మలయాళంలో హిట్టయిన ప్రేమమ్ సినిమాతో పేరుతెచ్చుకున్న అనుపమ ఈ సినిమాతో తెలుగుతెరకు పరిచయం అవుతోంది. రవితేజ సినిమాలన్నింటికీ తమనే సంగీత దర్శకుడు. ఈ మూవీకి కూడా తమనే సంగీతం అందించే ఛాన్స్ ఉంది.
First Published:  25 Sep 2015 7:02 PM GMT
Next Story