Telugu Global
Cinema & Entertainment

సినిమాల్లోకి రోజా కూతురు!

వెండి తెర మీదకి వారసులు రావడం కొత్త కాదు. మెగా ఫ్యామిలీ, అక్కినేని వారసులు, నందమూరి వారసులు… ఇలా ఫిల్మ్‌ ఇండస్ట్రీకి వారసుల రాక మామూలే. ఇపుడు ఆర్‌.కె. రోజా కూడా తన కుమార్తెను వెండి తెరకు పరిచయం చేయబోతున్నారు. రోజా సినిమాల్లో ఎన్నో ఆటుపోట్లను చవి చూశారు. ఆమె చాలా సినిమాల్లో నటించినప్పటికీ ‘సీతారత్నంగారి అబ్బాయి’ రోజా కెరీర్‌లో గుర్తుండిపోయే ఓ చిత్రరాజం. ఆ సినిమాలో ఆమె హావభావాలు, హొయలు, నటన యువతను కట్టిపడేస్తుంది.  ఒకప్పుడు […]

సినిమాల్లోకి రోజా కూతురు!
X
వెండి తెర మీదకి వారసులు రావడం కొత్త కాదు. మెగా ఫ్యామిలీ, అక్కినేని వారసులు, నందమూరి వారసులు… ఇలా ఫిల్మ్‌ ఇండస్ట్రీకి వారసుల రాక మామూలే. ఇపుడు ఆర్‌.కె. రోజా కూడా తన కుమార్తెను వెండి తెరకు పరిచయం చేయబోతున్నారు. రోజా సినిమాల్లో ఎన్నో ఆటుపోట్లను చవి చూశారు. ఆమె చాలా సినిమాల్లో నటించినప్పటికీ ‘సీతారత్నంగారి అబ్బాయి’ రోజా కెరీర్‌లో గుర్తుండిపోయే ఓ చిత్రరాజం. ఆ సినిమాలో ఆమె హావభావాలు, హొయలు, నటన యువతను కట్టిపడేస్తుంది. ఒకప్పుడు టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన రోజా సినిమా ప్రపంచం ఎలా ఉంటుందో స్వయంగా చూశారు… రాజకీయ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకత సంతరించుకున్న రోజాకు ఇప్పటికీ సినిమా రంగంపై మక్కువ పోలేదు. అప్పుడప్పుడూ తెలుగు తెర మీద కనిపిస్తూనే ఉన్నారు. కొన్ని ఛానల్స్‌లో బుల్లి తెరపై కూడా ఆమె యాంకరింగ్‌తో తన ప్రత్యేకతను చాటుకుంటూ పరవశం పొందుతున్నారు. ఈ రంగంలోకి ఇపుడు ఆమె కుమార్తెను ప్రవేశపెట్టబోతున్నారు. తన కుమార్తె అన్షు మల్లికను తెరంగ్రేటానికి సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే మల్లిక ఫొటో షూట్‌ పూర్తయ్యింది. ఇక ఫొటోల రిలీజే తరువాయని అంటున్నారు. బాలనటిగా ఇప్పటికే ఓ తమిళ చిత్రంలో ఈ బుల్లి రోజా నటించిందని చెబుతున్నారు. ఓ మంచి నిర్మాత, దర్శకుడి కోసం రోజా అన్వేషిస్తున్నారట!
First Published:  26 Sep 2015 12:00 AM GMT
Next Story