Telugu Global
CRIME

లాటరీ కింగ్ ఇళ్ళ నుంచి 100 కోట్ల స్వాధీనం

పశ్చిమబెంగాల్‌లో లాటరీ కింగ్‌గా పేరొందిన శాంటియాగో మార్టిన్‌కు చెందిన సంస్థలు, ఇళ్ల నుంచి ఆదాయపన్ను శాఖ అధికారులు రూ. 100 కోట్లు స్వాధీనం చేసుకోవడం కలకలం సృష్టించింది.  తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన మార్టిన్‌పై పలు కేసులున్నాయి. మార్టిన్ ఇళ్లపై దాడి చేసినప్పుడు వెయ్యి రూపాయల నోట్ల కట్టలు ట్రావెలర్ బాగ్‌లలో, గోనె సంచులలో ఉండడం చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. ఒక ఇంటిలో రూ. 54 కోట్లు దొరికితే మరో ఇంటిలో 21 కోట్ల రూపాయల నగదు దొరికింది. […]

పశ్చిమబెంగాల్‌లో లాటరీ కింగ్‌గా పేరొందిన శాంటియాగో మార్టిన్‌కు చెందిన సంస్థలు, ఇళ్ల నుంచి ఆదాయపన్ను శాఖ అధికారులు రూ. 100 కోట్లు స్వాధీనం చేసుకోవడం కలకలం సృష్టించింది. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన మార్టిన్‌పై పలు కేసులున్నాయి. మార్టిన్ ఇళ్లపై దాడి చేసినప్పుడు వెయ్యి రూపాయల నోట్ల కట్టలు ట్రావెలర్ బాగ్‌లలో, గోనె సంచులలో ఉండడం చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. ఒక ఇంటిలో రూ. 54 కోట్లు దొరికితే మరో ఇంటిలో 21 కోట్ల రూపాయల నగదు దొరికింది. సిలిగురిలో మరో ఇంటిలో 29 కోట్లు లభించాయి. ఇదంతా బీహారు శాసనసభ ఎన్నికలలో ఖర్చు పెట్టడానికి సిద్దం చేస్తున్నారా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మార్టిన్‌పై సిక్కింలో 4500 కోట్ల రూపాయల చీటింగ్ కేసు కూడా ఉంది. ఇతను దేశవ్యాప్తంగా ఏడు వేల కోట్ల రూపాయల లాటరీ వ్యాపారం నడిపారని చెబుతున్నారు. గతంలో డి.ఎమ్.కె. అధినేత కరుణానిధి కథ ఆధారంగా ఒక సినిమా కూడా తీశాడు.
First Published:  25 Sep 2015 3:00 PM GMT
Next Story