Telugu Global
Cinema & Entertainment

సానుభూతి చూపమని నేను అడగలేదు...

తనకు క్షమాభిక్ష పెట్టాలని తానెప్పుడూ మహారాష్ట్ర గవర్నర్‌ని కానీ, ఇంకెవరిని కానీ కోరలేదని బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ అన్నారు. 1993 ముంబయి పేలుళ్ల ఘటనకు సంబంధించిన కేసులో సంజయ్‌ దత్‌ దోషిగా ఎరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆయనకు క్షమాభిక్ష ఇచ్చి.. శిక్షాకాలాన్ని తగ్గించాలంటూ రెండు సంవత్సరాల క్రితం సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ లేఖ రాశారు. దానిని నిన్న మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు కొట్టివేశారు. ఈ విషయంపై సంజయ్‌దత్‌ […]

సానుభూతి చూపమని నేను అడగలేదు...
X
తనకు క్షమాభిక్ష పెట్టాలని తానెప్పుడూ మహారాష్ట్ర గవర్నర్‌ని కానీ, ఇంకెవరిని కానీ కోరలేదని బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ అన్నారు. 1993 ముంబయి పేలుళ్ల ఘటనకు సంబంధించిన కేసులో సంజయ్‌ దత్‌ దోషిగా ఎరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆయనకు క్షమాభిక్ష ఇచ్చి.. శిక్షాకాలాన్ని తగ్గించాలంటూ రెండు సంవత్సరాల క్రితం సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ లేఖ రాశారు. దానిని నిన్న మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు కొట్టివేశారు. ఈ విషయంపై సంజయ్‌దత్‌ ఈరోజు వివరణ ఇచ్చారు.
తానెప్పుడూ క్షమాభిక్ష కావాలని కోరలేదని సంజయ్‌దత్‌ చెప్పారు. అన్ని వార్తా పత్రికల్లో సంజయ్‌దత్‌ పెట్టుకున్న పిటిషన్‌ని మహారాష్ట్ర గవర్నర్‌ తిరస్కరించారని కథనాలు వెలువడ్డాయని.. అసలు సంజయ్‌దత్ కానీ, ఆయన కుటుంబసభ్యులు కానీ ఎవరూ అలాంటి పిటీషన్‌ పెట్టుకోలేదని సంజయ్‌ తరపు న్యాయవాదులు హితేష్‌ జైన్‌, సుభాష్‌ జాదవ్‌లు స్పష్టంచేశారు.
ఇదిలా వుండ‌గా.. సంజు బాయ్ కు మొత్తం 5 ఐళ్ల పాటు జైలు శిక్ష విధించారు . ఒక‌టిన‌ర సంవ‌త్స‌రం జూల్లు శిక్ష పూర్తి చేసిన త‌రువాత‌..త‌న సొద‌రి మాజీ ఎం పి ప్రియ‌ద‌త్ త‌న పొలిటిక‌ల్ ఇన్ ఫ్ల్యూయిన్స్ ను ఉప‌యోగించి సంజు భాయ్ ని బైయిలు విడిపించింది. ఆ త‌రువాత బ‌య‌ట‌కు వ‌చ్చి రెండో పెళ్ళి చేసుకోవ‌డం.. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు తండ్రి కావ‌డం.. సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ కావ‌డం.. హ్యాపిగా లైఫ్ సాగుతున్న స‌య‌యంలో.. రెండు వేల ప‌దమూడు లో మ‌ళ్లీ కోర్టు సంజు భాయ్ ను అదుపులోకి తీసుకొని మిగిలిన 3 న‌ర సంవ‌త్స‌రాల శిక్షా కాలం కూడా పూర్తి చేయాల‌ని ఉత్త‌ర్యూలు ఇవ్వ‌డం జ‌రిగింది. రెండు వేల ప‌ద‌మూడు మే నెల‌లో సంజుభాయ్ ఎర్ర‌వాడ జైలు కొచ్చాడు. ఇప్ప‌టి కి రెండు సంవ‌త్స‌రాల కాలం పూర్తి అయ్యింది. ఇంకా ఒక‌టిన‌ర యేడాది జైలు శిక్ష గ‌డ‌పాల్సి వుంది. అంటే వ‌చ్చే యేడాది డిసెంబర్ కు మ‌న ఖ‌ల్ నాయ‌క్ త‌న శిక్షా కాలాని పూర్తి చేసుకుని ఫ్రీ బ‌ర్డ్ అవుతాడ‌న్న‌మాట‌.
First Published:  26 Sep 2015 12:49 AM GMT
Next Story