Telugu Global
Cinema & Entertainment

చేసిన ప్రయోగమే మళ్లీ చేస్తాడా..

కమల్ హాసన్ ప్రయోగాలకు పెట్టింది పేరు. ఇప్పుడు మనం ప్రయోగాలు అనుకుంటున్న ఎన్నో సినిమాల్ని అప్పట్లోనే చేసి చూపించాడు లోకనాయకుడు. అయితే చేసిన ప్రయోగాన్నే మళ్లీ చేయడానికి మాత్రం ఇష్టపడడు. కానీ ఇప్పుడు అలాంటి సినిమానే చేయాల్సి వచ్చేట్టుంది. అదే పుష్పక విమానం. గతంలో సింగీతం శ్రీనివాసరావు, కమల్ కాంబినేషన్లో వచ్చిందీ సినిమా. ఇందులో ఎక్కడా డైలాగ్స్ ఉండవు. కానీ సినిమా సూపర్ హిట్. ఇప్పుడిదే సినిమాకు సీక్వెల్ చేస్తానంటున్నాడు సింగీతం. గతంలో పుష్పక విమానం చేసినప్పుడు […]

చేసిన ప్రయోగమే మళ్లీ చేస్తాడా..
X
కమల్ హాసన్ ప్రయోగాలకు పెట్టింది పేరు. ఇప్పుడు మనం ప్రయోగాలు అనుకుంటున్న ఎన్నో సినిమాల్ని అప్పట్లోనే చేసి చూపించాడు లోకనాయకుడు. అయితే చేసిన ప్రయోగాన్నే మళ్లీ చేయడానికి మాత్రం ఇష్టపడడు. కానీ ఇప్పుడు అలాంటి సినిమానే చేయాల్సి వచ్చేట్టుంది. అదే పుష్పక విమానం. గతంలో సింగీతం శ్రీనివాసరావు, కమల్ కాంబినేషన్లో వచ్చిందీ సినిమా. ఇందులో ఎక్కడా డైలాగ్స్ ఉండవు. కానీ సినిమా సూపర్ హిట్. ఇప్పుడిదే సినిమాకు సీక్వెల్ చేస్తానంటున్నాడు సింగీతం. గతంలో పుష్పక విమానం చేసినప్పుడు ఎడిటింగ్ రూమ్ లో చాలా సన్నివేశాలు కట్ చేసేశామని.. ఆ సన్నివేశాల్ని పెట్టుకొని కథ రాసుకుంటే సినిమా ఈజీగా అయిపోతుందని అంటున్నాడు. అయితే పుష్పక విమానం సీక్వెల్ లో కమల్ నటిస్తాడా లేదా అనేది మాత్రం చర్చనీయాంశమైంది. సీక్వెల్స్ చేయడం.. చేసిన ప్రయోగమే మళ్లీ చేయడం కమల్ కు నచ్చదు. సో.. పుష్పక విమానం-2పై త్వరలోనే క్లారిటీ రాబోతోంది.
First Published:  25 Sep 2015 7:31 PM GMT
Next Story