కొరటాలతో ఎన్టీఆర్ సినిమా కన్ ఫర్మ్

శ్రీమంతుడు తర్వాత కొరటాలతో సినిమా చేసేందుకు చాలా మంది స్టార్ హీరోలు ప్రయత్నించారు .కానీ ఫైనల్ గా ఆ అవకాశాన్ని ఎన్టీఆర్ దక్కించుకున్నాడు. కొరటాల తో సినిమాను పక్కా చేశాడు యంగ్ టైగర్. ఈ కన్ ఫర్మేషన్ కోసమే.. సుకుమార్ సినిమా షెడ్యూల్ ను బ్రేక చేసుకొని మరీ లండన్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. సినిమా స్టోరీలైన్ వినడంతో పాటు, మిగతా వ్యవహారాలన్నీ చక్కబెట్టాడు. కుదిరితే మరికొన్ని రోజుల్లో ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ గా ఎనౌన్స్ మెంట్ కూడా ఇవ్వబోతున్నాడు తారక్. అధికారికంగా ప్రకటన చేసిన తర్వాతే తిరిగి లండన్ వెళ్తాడు. తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్-కొరటాల సినిమా అక్టోబర్ 22 నుంచి ప్రారంభం అవుతుంది. ఈలోగా సుకుమార్ సినిమాను 90శాతం పూర్తిచేయాలని ఫిక్స్ అయ్యాడు తారక్. ప్రస్తుతం ఎన్టీఆర్-కొరటాల మధ్య స్క్రీన్ ప్లేకు సంబంధించిన కథాచర్చలు సాగుతున్నాయి.