Telugu Global
National

సానియా మీర్జా ఖాతాలో మ‌రో ప‌త‌కం!

సానియా మీర్జా వ‌రుస విజ‌యాల‌తో త‌న జోరును కొన‌సాగిస్తోంది. మార్టినా హింగిస్‌తో క‌లిసి  టెన్నిస్ డ‌బుల్స్‌లో మ‌రో విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఇద్ద‌రు మంచి ఆట తీరును క‌న‌బ‌రచ‌డంతో గాంగ్ జౌ టైటిల్‌ను సంయుక్తంగా గెలుచుకోగ‌లిగారు. టోర్నీలో భాగంగా శ‌నివారం జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో మార్టినా- సానియా జోడీ జంట 6-3, 6-1 స్కోరుతో వ‌రుస సెట్ల‌లో  షిలియ‌న్‌- జియోడిన్ ద్వ‌యాన్ని ఓడించి విజ‌యాన్ని కైవ‌సం చేసుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మార్టినా- సానియా జంటగా 13 మ్యాచుల్లో […]

సానియా మీర్జా ఖాతాలో మ‌రో ప‌త‌కం!
X
సానియా మీర్జా వ‌రుస విజ‌యాల‌తో త‌న జోరును కొన‌సాగిస్తోంది. మార్టినా హింగిస్‌తో క‌లిసి టెన్నిస్ డ‌బుల్స్‌లో మ‌రో విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఇద్ద‌రు మంచి ఆట తీరును క‌న‌బ‌రచ‌డంతో గాంగ్ జౌ టైటిల్‌ను సంయుక్తంగా గెలుచుకోగ‌లిగారు. టోర్నీలో భాగంగా శ‌నివారం జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో మార్టినా- సానియా జోడీ జంట 6-3, 6-1 స్కోరుతో వ‌రుస సెట్ల‌లో షిలియ‌న్‌- జియోడిన్ ద్వ‌యాన్ని ఓడించి విజ‌యాన్ని కైవ‌సం చేసుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మార్టినా- సానియా జంటగా 13 మ్యాచుల్లో బ‌రిలోకి దిగ‌గా ఇది వారికి 6వ విజ‌యం. కాగా, సానియామీర్జాకు ఈ సీజ‌న్లో ఇది వ‌రుస‌గా 7వ విజ‌యం కావ‌డం విశేషం.
First Published:  26 Sep 2015 11:40 PM GMT
Next Story