సెల్ ఫోన్ ఇష్టంలేదంటున్న నితిన్ హీరోయిన్

కొరియర్ బాయ్ కల్యాణ్ సినిమాతో మరోసారి లైమ్ లైట్లోకి వచ్చింది యామి గౌతమ్. ఈ పిల్ల గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసింది కొంచెమే. ఎందుకంటే.. తెలుగుతో పాటు హిందీ, మలయాళం, తమిళ భాషల్లో యామి బిజీగా ఉంటుంది. అందుకే తెలుగులో సినిమాలు తక్కువగా చేస్తుంటుంది. తాజాగా తనకు సంబంధించి ఓ గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది యామిగౌతమ్. తనకు సెల్ ఫోన్ అంటే అస్సలు ఇష్టముండదని ప్రకటించింది. నిత్యం మొబైల్ పట్టుకొని తిరగడం, అదెక్కడుందో అని ప్రతి నిమిషం తడుముకోవడం తనకు ఇష్టముండదని చెబుతోంది. ఇప్పటికీ ఇంట్లో ల్యాండ్ లైనే వాడుతుంటానని, అవుట్ డోర్స్ కు వెళ్లినప్పుడు తన అమ్మ కాల్స్ చూసుకుంటుందని చెప్పుకొచ్చింది. ల్యాప్ టాప్ మాత్రం మెయింటైన్ చేస్తుందట ఈ బ్యూటీ. అందులో ఫేస్ బుక్, ట్విట్టర్ చూస్తుంటానని చెప్పుకొచ్చింది. ఇన్ని చెప్పిన ఈ అమ్మడు.. తెలుగులో తనకు ఎందుకు అవకాశాలు రావడం లేదో మాత్రం చెప్పలేకపోతోంది.