Telugu Global
National

తిరుపతి కపిలతీర్థం మృత్యుకేళి, ఏడుగురు జలసమాధి

తిరుపతి కపిలతీర్థంలో మృత్యువు మాటువేసి ఏడుగురిని బలితీసుకుంది. ఆకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి ప్రవాహం ఒక్కసారి వచ్చిపడడంతో ఈతకెళ్లిన యువకులు మునిగి చనిపోయారు. నీటితో పాటు మట్టి, బండరాళ్లు కొండపై నుంచి కొట్టుకురావడంతో ప్రాణనష్టం అధికంగా జరిగింది. తిరుపతికి చెందిన యువకులు నిత్యం పెద్ద సంఖ్యలో కపిలతీర్థానికి వచ్చి జలకాలాడుతుంటారు. ఆదివారం కూడా ఎప్పటిలాగే యువకులు తరలివచ్చారు. అయితే మధ్యాహ్నం నుంచి తిరుపతితో పాటు తిరుమల కొండల్లో భారీ వర్షం కురిసింది. దీంతో కొండలపై నుంచి వర్షపు […]

తిరుపతి కపిలతీర్థం మృత్యుకేళి, ఏడుగురు జలసమాధి
X

తిరుపతి కపిలతీర్థంలో మృత్యువు మాటువేసి ఏడుగురిని బలితీసుకుంది. ఆకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి ప్రవాహం ఒక్కసారి వచ్చిపడడంతో ఈతకెళ్లిన యువకులు మునిగి చనిపోయారు. నీటితో పాటు మట్టి, బండరాళ్లు కొండపై నుంచి కొట్టుకురావడంతో ప్రాణనష్టం అధికంగా జరిగింది. తిరుపతికి చెందిన యువకులు నిత్యం పెద్ద సంఖ్యలో కపిలతీర్థానికి వచ్చి జలకాలాడుతుంటారు. ఆదివారం కూడా ఎప్పటిలాగే యువకులు తరలివచ్చారు. అయితే మధ్యాహ్నం నుంచి తిరుపతితో పాటు తిరుమల కొండల్లో భారీ వర్షం కురిసింది. దీంతో కొండలపై నుంచి వర్షపు నీరు వరదలా కపిలతీర్థం వైపు దూసుకొచ్చింది.క్షణాల వ్యవధిలో పెరిగిన వరద ఉధృతిని యువకులు గుర్తించలేకపోయారు. నీరు, మట్టి, బండరాళ్లు వచ్చి ఒక్కసారిగా ఈతకొడుతున్న వారిపై పడ్డాయి. కొందరు బయటకు రాగలిగారు. ఏడుగురు తీవ్రంగా గాయపడి కపిలతీర్థంలోనే మునిగిపోయారు. ఆర్థరాత్రి వరకు గాలించి ఏడుగురి మృతదేహాలను సిబ్బంది వెలికితీశారు. మృతులను నిఖిల్‌, శ్రీకాంత్‌, వెంకటేష్‌, తౌఫిద్‌, సచిన్‌ వర్మ, బాలాజిలుగా గుర్తించారు. మరోవైపు విషాదఘటన నేపథ్యంలో కపిల తీర్థంలో సంప్రోక్షణ చేసేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. ప్రస్తుత ఉన్న నీటిని మొత్తం తోడేసే పనిలో ఉన్నారు.

First Published:  27 Sep 2015 8:39 PM GMT
Next Story