Telugu Global
NEWS

నగరం నడిబొడ్డున స్తంభించిన ట్రాఫిక్‌

వినాయక నిమజ్జనోత్సవం ఈ ఏడాది ఊహించనంత ఆలస్యం అయింది. గత రెండు మూడు సంవత్సరాల్లో కూడా ఖైరతాబాద్‌ వినాయకుడి నిమజ్జనం కొన్ని గంటలు ఆలస్యం అయింది. కాని ఈ ఏడాది సోమవారం ఉదయందాకా ఖైరతాబాద్‌ వినాయకుడు కదలనేలేదు. సోమవారం ఉదయానికి కొన్ని వందల వినాయకులు నిమజ్జనంకోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ట్యాంక్‌ బండ్‌ నుంచి మొజాంజాహీ మార్కెట్‌ దాకా నాలుగు కిలోమీటర్ల మేర విగ్రహాల వాహనాలు నిలిచిపోయాయి. సోమవారం ఉదయానికి ఇంకా కొన్ని వందల విగ్రహాలు నిమజ్జనం చెయ్యాల్సి […]

నగరం నడిబొడ్డున స్తంభించిన ట్రాఫిక్‌
X

వినాయక నిమజ్జనోత్సవం ఈ ఏడాది ఊహించనంత ఆలస్యం అయింది. గత రెండు మూడు సంవత్సరాల్లో కూడా ఖైరతాబాద్‌ వినాయకుడి నిమజ్జనం కొన్ని గంటలు ఆలస్యం అయింది. కాని ఈ ఏడాది సోమవారం ఉదయందాకా ఖైరతాబాద్‌ వినాయకుడు కదలనేలేదు.

సోమవారం ఉదయానికి కొన్ని వందల వినాయకులు నిమజ్జనంకోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ట్యాంక్‌ బండ్‌ నుంచి మొజాంజాహీ మార్కెట్‌ దాకా నాలుగు కిలోమీటర్ల మేర విగ్రహాల వాహనాలు నిలిచిపోయాయి. సోమవారం ఉదయానికి ఇంకా కొన్ని వందల విగ్రహాలు నిమజ్జనం చెయ్యాల్సి ఉండింది. విగ్రహాల సంఖ్య ఈ ఏడాది బాగా పెరిగిందంటున్నారు.

నిమజ్జనోత్సవం ఆలస్యంకావడంతో ప్రజల బాధలు వర్ణనాతీతం. శుక్ర, ఆదివారాలు సెలవులు కావడంతో పెద్ద సంఖ్యలో ఊళ్ళకు వెళ్ళిన వాళ్ళు సోమవారం తెల్లవారుఝామునుంచి నగరానికి చేరుకుంటున్నారు. అయితే పోలీసులు ఇతర ఊర్లనుంచి వచ్చే బస్సులను సిటీలోకి రాకుండా శివారు ప్రాంతాల్లోనే ఆపేయడంతో ప్రయాణీకులు నానా బాధలు పడ్డారు. కొన్ని రూట్లలో సిటీబస్‌లను కూడా ఆపేయడంతో ఇళ్ళకు ఎలా చేరుకోవాలో తెలియని పరిస్థితి. ఆటోవాలాలు చెలరేగిపోయి కొన్నిచోట్ల కిలోమీటర్‌కు యాభైరూపాయల చొప్పున కూడా వసూలు చేశారు. అంతడబ్బు ఖర్చుపెట్టలేని వాళ్ళు లగేజీ, పిల్లల్ని మోసుకుంటూ రోడ్డువెంబడి బారులు తీరి నడిచి వెళ్ళడం అనేక రూట్స్‌లో కనిపించింది.

నగరం నడిబొడ్డున మధ్యాహ్నం వరకు ట్రాఫిక్‌ స్తంభించింది. ఆయా మార్గాల్లో ఆఫీసులకు వెళ్ళాల్సిన వాళ్ళు నరకం అనుభవించారు. ఒక్క కిలోమీటర్‌ దూరం వెళ్ళడానికి గంటా, రెండు గంటలు పట్టింది.

ఖైరతాబాద్‌ వినాయకుడి నిమజ్జనం పూర్తయ్యేసరికి సోమవారం సాయంత్రం లేదా రాత్రి కావచ్చునంటున్నారు. దాంతో ఈరోజు రాత్రివరకు నగరం నడిబొడ్డున ట్రాఫిక్‌ స్తంభించిపోతుంది. వాహనదారుల ఇక్కట్లు చెప్పనలవి కాదు. అయినదానికి కానిదానికి సెలవు ప్రకటించే ప్రభుత్వం ఈరోజు సెలవు ఇచ్చిఉంటే బావుండేదని వాహనదారుల కామెంట్‌?

First Published:  28 Sep 2015 3:09 AM GMT
Next Story