Telugu Global
Cinema & Entertainment

సిద్ధాపురాన్ని ఓకే చేసిన మహేష్

తండ్రి సూపర్ స్టార్ కృష్ణ స్వగ్రామం బుర్రిపాలెంను దత్తత తీసుకున్న ప్రిన్స్ మహేష్‌ తెలంగాణలోనూ ఒక గ్రామాన్ని ఫైనల్ చేశారు.  మంత్రి కేటీఆర్‌తో సమాలోచనల అనంతరం  మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం సిద్ధాపురాన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఈ విషయాన్ని ” శ్రీమంతుడు” తన ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు.    గ్రామాన్ని దత్తత తీసుకునే స్టోరి లైన్ ఆధారంగా తెరకెక్కిన ”శ్రీమంతుడు” సూపర్ డూపర్ హిట్ తర్వాత గ్రామాలు దత్తత తీసుకునేందుకు చాలా మంది ముందుకొస్తున్నారు. […]

సిద్ధాపురాన్ని ఓకే చేసిన మహేష్
X
తండ్రి సూపర్ స్టార్ కృష్ణ స్వగ్రామం బుర్రిపాలెంను దత్తత తీసుకున్న ప్రిన్స్ మహేష్‌ తెలంగాణలోనూ ఒక గ్రామాన్ని ఫైనల్ చేశారు. మంత్రి కేటీఆర్‌తో సమాలోచనల అనంతరం మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం సిద్ధాపురాన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఈ విషయాన్ని ” శ్రీమంతుడు” తన ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు.
గ్రామాన్ని దత్తత తీసుకునే స్టోరి లైన్ ఆధారంగా తెరకెక్కిన ”శ్రీమంతుడు” సూపర్ డూపర్ హిట్ తర్వాత గ్రామాలు దత్తత తీసుకునేందుకు చాలా మంది ముందుకొస్తున్నారు. నటుడు ప్రకాశ్ రాజ్‌కూడా ఇటీవల ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. తొలుత మహేష్ బుర్రిపాలెంను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించగా… మంత్రి కేటీఆర్ చొరవ తీసుకుని గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోనూ ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని మహేష్‌ను కోరారు. అందుకు మహేష్ వెంటనే ఓకే చేశారు. ఇప్పుడు తాను దత్తత తీసుకుంటున్న గ్రామాన్ని కూడా ప్రకటించారు.
First Published:  28 Sep 2015 6:02 AM GMT
Next Story