Telugu Global
NEWS

డైట్ విస్కీ డేంజ‌ర్ ?

డైట్ విస్కీ..డ‌యాబెటిక్ రోగుల‌కు మంచిద‌ని ఒక ప్ర‌చారం. డైట్ విస్కీ తాగితే కిక్కుంటుంది. క‌క్కు రాద‌ని తాగుబోతుల మౌత్ ప‌బ్లిసిటీ. దీనికి తోడు అతిపెద్ద కంపెనీ దీనిని ఉత్ప‌త్తి చేయ‌డం మ‌రో ఎత్తు. దీంతో తెలుగు రాష్ర్టాల్లో పెద్ద ఎత్తున మెక్‌డోవెల్స్ డైట్ విస్కీ అమ్మ‌కాలు ఊపందుకున్నాయి. రేటు కూడా త‌క్కువ కావ‌డంతో..అతి ఎక్కువ‌గా అమ్ముడుపోయే మాన్స‌న్‌హౌస్ బ్రాందీ స్థానాన్ని ఎంసీ డైట్ విస్కీ ఆక్ర‌మించింది. అయితే మెక్‌డోవెల్స్ డైట్ విస్కీ తాగితే లైఫ్ డేంజ‌ర్‌లో ప‌డిపోతుంద‌ని […]

డైట్ విస్కీ డేంజ‌ర్ ?
X

డైట్ విస్కీ..డ‌యాబెటిక్ రోగుల‌కు మంచిద‌ని ఒక ప్ర‌చారం. డైట్ విస్కీ తాగితే కిక్కుంటుంది. క‌క్కు రాద‌ని తాగుబోతుల మౌత్ ప‌బ్లిసిటీ. దీనికి తోడు అతిపెద్ద కంపెనీ దీనిని ఉత్ప‌త్తి చేయ‌డం మ‌రో ఎత్తు. దీంతో తెలుగు రాష్ర్టాల్లో పెద్ద ఎత్తున మెక్‌డోవెల్స్ డైట్ విస్కీ అమ్మ‌కాలు ఊపందుకున్నాయి. రేటు కూడా త‌క్కువ కావ‌డంతో..అతి ఎక్కువ‌గా అమ్ముడుపోయే మాన్స‌న్‌హౌస్ బ్రాందీ స్థానాన్ని ఎంసీ డైట్ విస్కీ ఆక్ర‌మించింది. అయితే మెక్‌డోవెల్స్ డైట్ విస్కీ తాగితే లైఫ్ డేంజ‌ర్‌లో ప‌డిపోతుంద‌ని అంటున్నారు క‌ర్నూలు జిల్లా వాసి. డైట్ విస్కీ తాగిన వారంతా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నార‌ని, ఇది ప్ర‌మాద‌క‌ర‌మైన ఆల్క‌హాల్ అని వైద్యులు చెబుతున్నార‌ని, కొన్ని ప‌రీక్ష‌లు కూడా ఇదే విష‌యాన్ని నిర్ధారించాయ‌ని క‌ర్నూలు వాసి వాపోతున్నాడు. తెలుగు రాష్ర్టాల ప్ర‌భుత్వాలు ఎంసీ డైట్ విస్కీ అమ్మ‌కాల‌ను నిషేధించాల‌ని కోరుతూ హైకోర్టును ఆశ్ర‌యించాడు. ఎంసీ డైట్ విస్కీ మద్యం తాగినవారు అనారోగ్యానికి గురువుతున్నారని హైకోర్టులో దాఖ‌లు చేసిన ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యంలో పేర్కొన్నాడు. ఈ మద్యం క్వాలిటీ బాగుండటం లేదని… దీన్ని తాగిన వారు అనారోగ్యానికి గురవుతున్నారని పిటిషన్ లో తెలియజేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు వైద్యుల నుంచి నివేదికలు, ప‌రీక్ష‌ల రిపోర్టులు అందినప్పటికీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేశాడు. ఈ మద్యాన్ని నిషేధించేలా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టులో దాఖ‌లు చేసిన పిల్‌లో కోరాడు. డైట్ విస్కీ మ‌ద్యం ప్రియుల‌కు ఈ విష‌యం తీవ్ర‌మైన షాక్‌కు గురి చేసింది

First Published:  28 Sep 2015 6:41 AM GMT
Next Story