సమంతకు విడాకులిచ్చిన మురుగదాస్

తమిళనాట దర్శకుడు మురుగదాస్ కు యమ క్రేజ్ ఉంది. అతడి సినిమాలపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తారు తమిళ ఆడియన్స్. తమిళ్‌ సినిమాలు చేస్తూనే మరోవైపు హిందీలో కూడా సినిమాలు చేస్తున్నాడు మురుగ. అలాంటి స్టార్ డైరక్టర్ పై ఊహించని కామెంట్స్ చేసింది సమంత. తాజాగా మురుగదాస్ తన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ పుట్టినరోజు నాడు మురుగదాస్ ను ఉద్దేశించి కొన్ని ట్వీట్స్ చేసింది సమంత. హ్యాపీ బర్త్ డే చెబుతూనే.. మీరు నాకు విడాకులిచ్చినా నేను మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటానంటూ ఆశ్చర్యకరమైన కామెంట్స్ చేసింది. మొదట్లో ఈ కామెంట్స్ చూసి అంతా షాకయ్యారు. తర్వాత మురుగను ఆటపట్టించడానికే సమంత ఇలా ట్వీట్ చేసిందని తెలుసుకొని అంతా నవ్వుకున్నారు.