Telugu Global
Cinema & Entertainment

లోఫర్ టైటిల్ మారబోతుందా..?

ప్రస్తుతం లోఫర్ అనే సినిమా చేస్తున్నాడు పూరి జగన్నాధ్. నాగబాబు తనయుడు వరుణ్ తేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ సినిమాకు మొదట్నుంచి లోఫర్ అనే టైటిల్ తోనే పిలుస్తున్నారు. కానీ ఇప్పుడు తాజాగా ఆ పేరును మార్చే ఉద్దేశంలో ఉన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ దర్శకుడు పూరి జగన్నాధ్ ఈ విషయాన్ని కన్ ఫర్మ్ చేశాడు. లోఫర్ సినిమా అమ్మ-కొడుకుల మధ్య అనుబంధంతో తెరకెక్కుతోంది. ఇలాంటి సినిమాకు […]

లోఫర్ టైటిల్ మారబోతుందా..?
X
ప్రస్తుతం లోఫర్ అనే సినిమా చేస్తున్నాడు పూరి జగన్నాధ్. నాగబాబు తనయుడు వరుణ్ తేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ సినిమాకు మొదట్నుంచి లోఫర్ అనే టైటిల్ తోనే పిలుస్తున్నారు. కానీ ఇప్పుడు తాజాగా ఆ పేరును మార్చే ఉద్దేశంలో ఉన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ దర్శకుడు పూరి జగన్నాధ్ ఈ విషయాన్ని కన్ ఫర్మ్ చేశాడు. లోఫర్ సినిమా అమ్మ-కొడుకుల మధ్య అనుబంధంతో తెరకెక్కుతోంది. ఇలాంటి సినిమాకు అలాంటి పేరు పెట్టడం మంచిది కాదని ఇప్పటికే చాలామంది జగన్ కు సూచించారు. ఈ సూచనలన్నీ లెక్కలోకి తీసుకున్న పూరి జగన్నాధ్, లోఫర్ సినిమా టైటిల్ ను మార్చే ఉద్దేశం ఉందని ప్రకటించాడు. సినిమా షూటింగ్ కంప్లీట్ అయి, ప్రమోషన్ ప్రారంభించే టైమ్ లో కొత్త టైటిల్ ప్రకటిస్తామంటున్నాడు ఈ బర్త్ డే బాయ్.
First Published:  27 Sep 2015 9:00 PM GMT
Next Story