Telugu Global
Others

అక్బర్, కేటీఆర్ మధ్య తీవ్ర వాగ్వాదం

రైతు సమస్యలపై చర్చ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్, మంత్రి కేటీఆర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చర్చలో పాల్గొన్న అక్బర్ పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.  మంత్రుల నియోజకవర్గాల్లో జరిగిన ఆత్మహత్యల సంఖ్యను వివరించారు. రైతులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. అయితే తాను మాట్లాడుతుంటే అధికార పార్టీ సభ్యులు నవ్వుతున్నారంటూ అక్బర్ అభ్యంతరం చెప్పారు. అధికార పార్టీ సభ్యుల తీరును ప్రజలు చూస్తున్నారని విమర్శించారు. దీనికి కేటీఆర్ […]

అక్బర్, కేటీఆర్ మధ్య తీవ్ర వాగ్వాదం
X

రైతు సమస్యలపై చర్చ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్, మంత్రి కేటీఆర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చర్చలో పాల్గొన్న అక్బర్ పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. మంత్రుల నియోజకవర్గాల్లో జరిగిన ఆత్మహత్యల సంఖ్యను వివరించారు. రైతులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. అయితే తాను మాట్లాడుతుంటే అధికార పార్టీ సభ్యులు నవ్వుతున్నారంటూ అక్బర్ అభ్యంతరం చెప్పారు. అధికార పార్టీ సభ్యుల తీరును ప్రజలు చూస్తున్నారని విమర్శించారు. దీనికి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. అక్బర్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. రైతుల సమస్యలను ఎంతో సీరియస్‌గా తీసుకున్నాం కాబట్టే ప్రశ్నోత్తరాలను కూడా రద్దు చేసి చర్చకు సిద్ధపడ్డామన్నారు. పెద్ద గొంతేసుకుని గట్టిగా అరిస్తే సరిపోదని చెప్పాల్సిందేదో సీదాగా చెప్పాలని కేటీఆర్ అన్నారు.

కేటీఆర్ వ్యాఖ్యలపై అక్బర్ తిరిగి తీవ్రంగా స్పందించారు. మంత్రి తనను సీదాగా మాట్లాడాలంటున్నారని… ఇప్పుడు తానేమైనా తేడాగా మాట్లాడుతున్నానా అని నిలదీశారు. సీదాగా మాట్లాడడం అంటే మంత్రి కేటీఆర్ దృష్టిలో ఏమిటని ప్రశ్నించారు. విదేశాల్లో చదువుకుని వచ్చిన వ్యక్తి ఇలా మాట్లాడడం సరికాదని అక్బర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ దశలో ఇరు పక్షాలు సభ్యులు కూడా పైకి లేచారు. అయితే స్పీకర్ సద్దిచెప్పడంతో వివాదానికి తెరపడింది. మిత్రపక్షాలుగా ఉంటున్న టీఆర్ఎస్, ఎంఐఎంకు చెందిన కీలక నేతల మధ్య ఈ స్థాయిలో వాగ్వాదం జరిగడం చర్చనీయాంశమైంది.

First Published:  29 Sep 2015 3:26 AM GMT
Next Story