Telugu Global
Cinema & Entertainment

రేపట్నుంచే పవన్ ఐటెంసాంగ్

ఎవరూ ఊహించని విధంగా పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ శరవేగంగా నడుస్తోంది. ఇప్పటికే 2 కీలక షెడ్యూల్స్ పూర్తిచేసుకున్న ఈ సినిమా రేపట్నుంచి మరో కీలకమైన అంకం లోకి ఎంటర్ కాబోతోంది. రామానాయుడు స్టుడియోస్ లో రేపట్నుంచి పవన్ కల్యాణ్ సినిమాకు సంబంధించి ఐటెంసాంగ్ పిక్చరైజ్ చేయబోతున్నారు. ఈ సాంగ్ లో నటించేందుకు ఇప్పటికే లక్ష్మీరాయ్ హైదరాబాద్ చేరుకుంది. రేపట్నుంచి పవన్-లక్ష్మీరాయ్ జంటగా ఈ ఐటెంసాంగ్ షూట్ ఉంటుంది. గతంలో వచ్చిన గబ్బర్ […]

రేపట్నుంచే పవన్ ఐటెంసాంగ్
X
ఎవరూ ఊహించని విధంగా పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ శరవేగంగా నడుస్తోంది. ఇప్పటికే 2 కీలక షెడ్యూల్స్ పూర్తిచేసుకున్న ఈ సినిమా రేపట్నుంచి మరో కీలకమైన అంకం లోకి ఎంటర్ కాబోతోంది. రామానాయుడు స్టుడియోస్ లో రేపట్నుంచి పవన్ కల్యాణ్ సినిమాకు సంబంధించి ఐటెంసాంగ్ పిక్చరైజ్ చేయబోతున్నారు. ఈ సాంగ్ లో నటించేందుకు ఇప్పటికే లక్ష్మీరాయ్ హైదరాబాద్ చేరుకుంది. రేపట్నుంచి పవన్-లక్ష్మీరాయ్ జంటగా ఈ ఐటెంసాంగ్ షూట్ ఉంటుంది. గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వుకేక సాంగ్ ఎంత హిట్టయిందో అందరికీ తెలిసిందే. దాన్ని మించేలా ఈ నయా మూవీలో ఐటెంసాంగ్ ను కంపోజ్ చేశారని తెలుస్తోంది. ఈ స్పెషల్ సాంగ్ సాహిత్యం, సంగీతం విషయంలో పవన్ ప్రత్యేక శ్రద్ధ చూపించారు. సాహిత్యంలో ద్వంద్వార్థాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సంగీతం విషయంలో కూడా కొన్ని ఆంక్షలు పెట్టారు. అలా పవన్ పర్యవేక్షణలో సిద్ధమైన ఐటెంసాంగ్ షూటింగ్ రేపట్నుంచి రామానాయుడు స్టుడియోస్ లో తెరకెక్కనుంది.
First Published:  29 Sep 2015 1:00 AM GMT
Next Story