Telugu Global
National

లొంగిపోయిన మాజీ మంత్రి 

ఆప్ మాజీ మంత్రి సోమ్నాథ్ భారతి ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయాడు. భార్య లిపికా మిత్రా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై గృహహింస, హత్యాయత్నం కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుల్లో యాంటిస్పెటరీ బెయిల్ ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో ఆయన వేసిన పిటిషన్ ను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో సోమ్నాథ్ అరెస్టు అనివార్యంగా మారడంతో అజ్ఞాతంలోకి వెళ్లారు. ముందస్తు బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించారు. ఇక్కడా ఆయనకు భంగపాటే ఎదురైంది. బాధ్యతగల పౌరుడిగా సోమవారం సాయంత్రంలోగా […]

లొంగిపోయిన మాజీ మంత్రి 
X
ఆప్ మాజీ మంత్రి సోమ్నాథ్ భారతి ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయాడు. భార్య లిపికా మిత్రా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై గృహహింస, హత్యాయత్నం కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుల్లో యాంటిస్పెటరీ బెయిల్ ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో ఆయన వేసిన పిటిషన్ ను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో సోమ్నాథ్ అరెస్టు అనివార్యంగా మారడంతో అజ్ఞాతంలోకి వెళ్లారు. ముందస్తు బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించారు. ఇక్కడా ఆయనకు భంగపాటే ఎదురైంది. బాధ్యతగల పౌరుడిగా సోమవారం సాయంత్రంలోగా అజ్ఞాతాన్ని వీడి లొంగిపోవాలని సుప్రీం తేల్చి చెప్పింది. సోమ్ నాథ్ లొంగిపోయాకే తదుపరి విచారణను అక్టోబరు 1న చేపడతామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కేసు గురువారానికి వాయిదాపడింది. దీంతో గత్యంతరం లేక ఆయన సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ద్వారకా పోలీసు స్టేషన్లో లొంగిపోయారు. కోర్టు ఆదేశాల మేరకే తాను లొంగిపోతున్నానని విలేకరులకు తెలిపారు. చట్టం నుంచి తాను తప్పించుకు తిరుగుతున్నానంటూ వస్తున్న వార్తల్ని సోమ్నాథ్ ఖండించారు.
First Published:  28 Sep 2015 10:52 PM GMT
Next Story