Telugu Global
Others

చంద్రబాబుకు కాపులెప్పుడూ కరివేపాకే..

టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేంద్ర కమిటీని, రెండు తెలుగు రాష్ట్రాలకు రాష్ట్ర కమిటీలను ప్రకటించారు. టిడిపి కమిటీల కూర్పులో కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందనీ చెప్పవచ్చు. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు కాపులు ఎక్కువగా ఉండే కోస్తాంధ్రాలో పర్యటించేటప్పుడు కాపుల పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ అని… కాపు సోదరులంతా తిరిగి టిడిపిలోకి రావాలని చంద్రబాబు ఆహ్వానం పలికాడు. కాపు సోదరులకు టిడిపిలోనే కాదు… తన హృదయంలోను చోటిస్తానని చంద్రబాబు నమ్మ బలికాడు. […]

చంద్రబాబుకు కాపులెప్పుడూ కరివేపాకే..
X
naniటిడిపి అధినేత చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేంద్ర కమిటీని, రెండు తెలుగు రాష్ట్రాలకు రాష్ట్ర కమిటీలను ప్రకటించారు. టిడిపి కమిటీల కూర్పులో కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందనీ చెప్పవచ్చు. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు కాపులు ఎక్కువగా ఉండే కోస్తాంధ్రాలో పర్యటించేటప్పుడు కాపుల పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ అని… కాపు సోదరులంతా తిరిగి టిడిపిలోకి రావాలని చంద్రబాబు ఆహ్వానం పలికాడు.
కాపు సోదరులకు టిడిపిలోనే కాదు… తన హృదయంలోను చోటిస్తానని చంద్రబాబు నమ్మ బలికాడు. చంద్రబాబునాయుడు మాయమాటలు నమ్మిన కాపులు 2014 ఎన్నికల్లో టిడిపి వెంట ఉండి రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అవడంలో ప్రధాన పాత్ర పోషించారు. తనకు ఎంతో సాయం చేసిన కాపులను చంద్రబాబు కరివేపాకులా తీసిపారెస్తున్నాడు. ఇపుడు తెలుగుదేశం పార్టీలో వేసిన కమిటీల్లో కూడా ‘వీళ్ళు కాపులు’ అని తెలియని వారికి పదవులిచ్చి ‘మమ’ అనిపించారు.
టిడిపి కమిటీలలో కాపులకు అన్యాయం!
రాష్ట్ర జనభాలో 30 శాతం ఉండి… టిడిపి అధికారంలోకి రావడానికి కారణమైన కాపులకు తెలుగుదేశం పార్టీ కమిటీలలో తీవ్ర అన్యాయం జరిగింది. 2014 ఎన్నికల్లో వైఎస్‌ఆర్సీపికి పూర్తిగా సహకరించిన ఎస్సీ సామాజిక వర్గానికి, రెడ్డి సామాజిక వర్గానికి కమిటీలలో సముచిత స్ధానాన్ని ఇచ్చిన చంద్రబాబు… కాపులకు మాత్రం మొండిచెయి చూపాడు. 2014లో జరిగిన ఎన్నికల్లో రాయలసీమ, ఉత్తరాంధ్రా జిల్లాల్లో టిడిపి-జగన్ పార్టీలు నువ్వా నేనా అన్నట్లు ఫలితాలు సాధించాయి.
కాపులు అధికంగా ఉండే జిల్లాలలో టిడిపికి అత్యధిక సీట్లు రావడం వలన ఈరోజు చంద్రబాబునాయుడు అధికారాన్ని అనుభవిస్తున్నాడు. ఉదాహరణకు పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 23 లక్షల ఓటర్లుండగా…అందులో 11 లక్షల మంది కాపు ఓటర్లే. వీరంతా ఆనాడు టిడిపికి మద్దతుగా ఉండటంవల్ల జిల్లాలో ఉన్న 15 అసెంబ్లీ స్థానాలను 2 పార్లమెంట్ స్థానాలను టిడిపి గెలుచుకుంది. ఈ జిల్లాలో జగన్ పార్టీ ఒక్క సీటు గెలవలేదు. కాపులు ఎక్కువగా ఉండే మరో జిల్లా తూర్పు గోదావరిలో కూడా తెలుగుదేశం పార్టీ 15 అసెంబ్లీ, 3 పార్లమెంట్ సీట్లను కైవసం చేసుకుంది. దీన్ని బట్టి చూస్తే కాపులు టిడిపి వైపు లేకపోతే… ఆనాడు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకొచ్చేది కాదు. ఇంతటి సహాయం చేసిన కాపు సామాజిక వర్గాన్ని చంద్రబాబునాయుడు మరోసారి వాడుకొని వదిలేశాడు.
చంద్రబాబు ప్రకటించిన కమిటీలను పరిశీలిస్తే కాపులకు ఘోర అవమానం జరిగిందనే భావన సర్వత్రా వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ అధ్యక్ష పదవిని కమ్మ సామాజిక వర్గానికి… తెలంగాణా రాష్ట్ర టిడిపి అధ్యక్షా పదవిని బిసి వర్గానికి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షా స్థానాన్ని కూడా బిసిలకు కేటాయించారు. ఈ కమిటీలకు ఉపాధ్యక్షులుగా రెడ్లను… ఎస్పీలను నియమించి… కాపులను పూర్తిగా విస్మరించి అవమానించాడు.
పార్టీలో ముఖ్యమైన పొలిట్ బ్యూరో విభాగంలో గాని… కేంద్ర అధికార ప్రతినిధులుగాగాని కాపుల కోసం మాట్లాడే ఏఒక్క నాయకుడికి చంద్రబాబు చోటు కల్పించలేదు. కాపు సామాజిక వర్గం నుంచి గట్టిగా మాట్లాడే గంటా శ్రీనివాసరావు, తోట త్రిమూర్తులు, పార్టీలో సీనియర్ నాయకుడైనా చిక్కాల రామచంద్రరావులకు పార్టీ కమిటీలలో ఎక్కడ చోటు కల్పించలేదు. తనకు వీరవిధేయత చూపే చినరాజప్పనే కాపు కోటా నుంచి ఎంపిక చేసి చంద్రబాబు మరోసారి తన కపట బుద్ధిని చాటుకున్నాడు.
కాపులను ప్రక్కకు పెట్టడానికి చంద్రబాబు పార్టీ నియమాలను కూడా మార్చేస్తాడా… అనే విధాంగా కమిటీల ఎంపికలో ఒక పరిణామం చోటుచేసుకుంది. అదేమిటంటే పూర్వం నుంచి పార్లమెంటులో లోక్‌సభ, రాజ్యసభలలో టిడిపి ఫ్లోర్ లీడర్లుగా కొనసాగుతున్న వారు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులగా కొనసాగుతున్నారు. ఆ పద్ధతి ప్రకారమే చంద్రబాబు ప్రకటించిన కమిటీలో రాజ్యసభలో టిడిపి నేతగా కొనసాగుతున్న సుజానాచౌదరికి పొలిట్ బ్యూరో మెంబర్‌గా అవకాశం ఇచ్చారు. కానీ లోక్‌సభలో టిడిపి పక్ష నాయకుడిగా ఉన్న తోట నరసింహనికి పొలిట్ బ్యూరోలో చోటు కల్పించలేదు.
దీన్ని బట్టి చూస్తే కాపుల కోసం మాట్లాడే నాయకులంటే చంద్రబాబుకు అసలు నచ్చదని రుజువయ్యింది. ఎన్నికల్లోనైనా చంద్రబాబునాయుడు కాపులకు ఎందుకు సీట్లిస్తాడంటే ఆస్థానాల్లో కాపుల తప్ప వేరే వారు గెలవరు కాబట్టి… అంతేగాని కాపు సామాజిక వర్గంపై ప్రేమతో కాదనే విషయాన్ని మరోసారి రుజువైంది.
– సవరం నాని
First Published:  30 Sep 2015 6:39 AM GMT
Next Story