Telugu Global
Others

సాగర్‌లో వ్యర్థాల తొలగింపు ప్రక్రియ షురూ

హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనమైన వినాయక విగ్రహాల తాలూకు వ్యర్థాల తొలగింపు పనులు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. విగ్రహాలు, వాటికి సంబంధించిన అవశేషాలు, పూలు పత్రి ఇతర వ్యర్ధాలు చకచకా తొలగిస్తున్నారు. ఇందుకోసం డ్రెజ్జింగ్ యుటిలిటీ క్రాప్టు(డీయూసీ) యంత్రాలను హెచ్‌ఎండీఏ వినియోగిస్తోంది. ఇందులో భాగంగానే మూడు రోజుల నుంచి ఎన్టీఆర్ మార్గంలో 2800 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను వెలికితీసినట్లు హెచ్‌ఎండీఏ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పరం జ్యోతి తెలిపారు. ఈ వ్యర్థాల తొలగింపు ప్రక్రియ దాదాపు చివరి దశకు వచ్చిందని, మరో రెండు […]

హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనమైన వినాయక విగ్రహాల తాలూకు వ్యర్థాల తొలగింపు పనులు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. విగ్రహాలు, వాటికి సంబంధించిన అవశేషాలు, పూలు పత్రి ఇతర వ్యర్ధాలు చకచకా తొలగిస్తున్నారు. ఇందుకోసం డ్రెజ్జింగ్ యుటిలిటీ క్రాప్టు(డీయూసీ) యంత్రాలను హెచ్‌ఎండీఏ వినియోగిస్తోంది. ఇందులో భాగంగానే మూడు రోజుల నుంచి ఎన్టీఆర్ మార్గంలో 2800 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను వెలికితీసినట్లు హెచ్‌ఎండీఏ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పరం జ్యోతి తెలిపారు. ఈ వ్యర్థాల తొలగింపు ప్రక్రియ దాదాపు చివరి దశకు వచ్చిందని, మరో రెండు రోజుల్లో వ్యర్థాల తొలగింపు పూర్తవుతుందని ఆయన చెప్పారు.
First Published:  29 Sep 2015 1:06 PM GMT
Next Story