Telugu Global
Others

భారీగా భారత దౌత్యవేత్తల నియామకం

పాకిస్థాన్, చైనా, బ్రిటన్, జర్మనీ తదితర దేశాల రాయబారులతోపాటు ఐక్యరాజ్యసమితి రాయబారినీ మార్చాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. పాకిస్థాన్‌లో హై కమిషనర్‌గా వ్యవహరిస్తున్న టీసీఏ రాఘవన్ డిసెంబర్ 31న పదవీ విరమణ చేయనుండటంతో ఆయన స్థానంలో భూటాన్‌లో భారత రాయబారిగా పనిచేస్తున్న గౌతమ్ బాంబావాలే నియమించాలని నిర్ణయించారు. ప్రస్తుతం విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎంఈఏ)లో సెక్రటరీగా పనిచేస్తున్న నవతేజ్ సర్నాను బ్రిటన్‌లో దౌత్యవేత్తగా నియమించనున్నారు. ప్రస్తుతం ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్న రంజన్ మథాయ్ […]

పాకిస్థాన్, చైనా, బ్రిటన్, జర్మనీ తదితర దేశాల రాయబారులతోపాటు ఐక్యరాజ్యసమితి రాయబారినీ మార్చాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. పాకిస్థాన్‌లో హై కమిషనర్‌గా వ్యవహరిస్తున్న టీసీఏ రాఘవన్ డిసెంబర్ 31న పదవీ విరమణ చేయనుండటంతో ఆయన స్థానంలో భూటాన్‌లో భారత రాయబారిగా పనిచేస్తున్న గౌతమ్ బాంబావాలే నియమించాలని నిర్ణయించారు. ప్రస్తుతం విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎంఈఏ)లో సెక్రటరీగా పనిచేస్తున్న నవతేజ్ సర్నాను బ్రిటన్‌లో దౌత్యవేత్తగా నియమించనున్నారు. ప్రస్తుతం ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్న రంజన్ మథాయ్ స్థానంలో నవతేజ్ వెళ్లనున్నారు. నవంబర్‌లో ప్రధాని నరేంద్రమోడీ బ్రిటన్ పర్యటన తరువాత నవతేజ్ కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశముంది. ఇక ఎంఈఏ ముఖ్య అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్.. భారత్ తరఫున న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి శాశ్వత ప్రతినిధిగా నియమితుడు కానున్నారు. ప్రస్తుతం ఐరాస ప్రతినిధిగా వ్యవహరిస్తున్న అశోక్ ముఖర్జీ స్థానాన్ని అక్బరుద్దీన్ భర్తీ చేయనున్నారు. కాగా జర్మనీలో భారత రాయబారిగా వ్యవహరిస్తున్న విజయ్ గోఖలేకు చైనా బాధ్యతలు అప్పగించనున్నారు. అశోక్ కాంతా నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. వీరితోపాటు మాస్కో, జపాన్, ఆఫ్ఘనిస్థాన్ రాయబారుల్లోనూ మార్పులు జరుగనున్నాయి.
First Published:  29 Sep 2015 1:06 PM GMT
Next Story