Telugu Global
Others

శాంతి పరిరక్షణలో మాకు ప్రాధాన్యం ఎక్కడ: మోడి

ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళాలకు వేల మంది సైనికులను అందిస్తున్న దేశాలకు విధాన నిర్ణయాల్లో ఎందుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రశ్నించారు. సైనికులను అందించే దేశాలకు ఐరాస శాంతి పరిరక్షణ నిర్ణయాల్లో అవకాశం ఇవ్వకపోవటం వల్లనే తీవ్రమైన సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. ఐరాస శాంతి సైనికులు ప్రస్తుతం శాంతి పరిరక్షణ కోసమే కాకుండా అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని చెప్పారు. న్యూయార్క్‌లో అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా నిర్వహించిన పీస్‌ కీపింగ్ సమావేశంలో […]

ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళాలకు వేల మంది సైనికులను అందిస్తున్న దేశాలకు విధాన నిర్ణయాల్లో ఎందుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రశ్నించారు. సైనికులను అందించే దేశాలకు ఐరాస శాంతి పరిరక్షణ నిర్ణయాల్లో అవకాశం ఇవ్వకపోవటం వల్లనే తీవ్రమైన సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. ఐరాస శాంతి సైనికులు ప్రస్తుతం శాంతి పరిరక్షణ కోసమే కాకుండా అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని చెప్పారు. న్యూయార్క్‌లో అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా నిర్వహించిన పీస్‌ కీపింగ్ సమావేశంలో మోడీ ప్రసంగించారు. వివిధ దేశాల్లో ఐరాస ఇప్పటివరకు 69 శాంతి పరిరక్షణ మిషన్లు చేపట్టగా 48 మిషన్ల కోసం భారత్ 1,80,000 మంది సైనికులను అందించిందని మోడీ తెలిపారు. శాంతి పరిరక్షణ విధుల్లో 161 మంది భారత సైనికులు ప్రాణాలర్పించారని చెప్పారు. మరి తమ వంటి దేశానికి శాంతి నిర్ణయాల్లో భాగస్వామ్యం అవసరం లేదా అని ప్రశ్నించారు.
First Published:  29 Sep 2015 1:08 PM GMT
Next Story