Telugu Global
Cinema & Entertainment

పరస్పరం అభినందించుకున్నారు

పులి సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాపై తెలుగులో పెద్దగా అంచనాల్లేవ్. కానీ ఈ సినిమాతో శ్రీదేవి దాదాపు 2 దశాబ్దాల గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇస్తోంది. అందుకే తెలుగు ప్రేక్షకులకు కూడా పులి కనెక్ట్ అయింది. దీంతోపాటు బాహుబలిని బీట్ చేసే సినిమా ఇదేనంటూ సౌత్ లో తెగ ప్రచారం జరుగడం కూడా పులిని టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గర చేయడానికి మరో కారణం. ఈ నేపథ్యంలో పులి సినిమాపై రాజమౌళి […]

పరస్పరం అభినందించుకున్నారు
X
పులి సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాపై తెలుగులో పెద్దగా అంచనాల్లేవ్. కానీ ఈ సినిమాతో శ్రీదేవి దాదాపు 2 దశాబ్దాల గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇస్తోంది. అందుకే తెలుగు ప్రేక్షకులకు కూడా పులి కనెక్ట్ అయింది. దీంతోపాటు బాహుబలిని బీట్ చేసే సినిమా ఇదేనంటూ సౌత్ లో తెగ ప్రచారం జరుగడం కూడా పులిని టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గర చేయడానికి మరో కారణం. ఈ నేపథ్యంలో పులి సినిమాపై రాజమౌళి ట్వీట్ చేశాడు. బాహుబలి సినిమాని సౌత్ లోనే సూపర్ డూపర్ హిట్ ప్రాజెక్ట్ గా నిలిపిన జక్కన్న.. పులి సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకున్నాడు. విజయ్ తోపాటు టోటల్ టీంకు శుభాకాంక్షలు చెప్పాడు. దీనికి విజయ్ కూడా స్పందించాడు. మీరు కోరుకున్నట్టే పులి సినిమా తప్పకుండా విజయం సాధించాలని కోరుంటున్నా.. అంటూ రాజమౌళికి రీట్వీట్ చేశాడు విజయ్.
First Published:  29 Sep 2015 7:00 PM GMT
Next Story