Telugu Global
Cinema & Entertainment

టెంప‌రరీ పెళ్లి కి రెడీ అంటున్న స‌ల్మాన్..!

బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ అంటే  స‌ల్మాన్ ఖాన్ పేరు వినిపిస్తుంది.   స‌ల్మాన్ ఖాన్ పెళ్లి గురించి  సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో కూడా  ఫ‌న్నీ కామెంట్స్  వ‌స్తుంటాయి.   తాజాగా  స‌ల్మాన్ ఖాన్ సుల్తాన్ అనే చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే.ఈ చిత్రం  ప్రెస్ మీట్ లో స‌ల్మాన్ ఖాన్ ను మీడియా మిత్రులు .. పెళ్లి గురించి  అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఫ‌న్నీ స‌మాధానాలు ఇచ్చారు.  ఇప్ప‌టి జ‌న‌రేష‌న్ కు పెళ్లి అనేది ప‌ర్మ‌నెంట్  ఇష్యూ […]

టెంప‌రరీ పెళ్లి కి రెడీ అంటున్న స‌ల్మాన్..!
X

బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ అంటే స‌ల్మాన్ ఖాన్ పేరు వినిపిస్తుంది. స‌ల్మాన్ ఖాన్ పెళ్లి గురించి సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో కూడా ఫ‌న్నీ కామెంట్స్ వ‌స్తుంటాయి. తాజాగా స‌ల్మాన్ ఖాన్ సుల్తాన్ అనే చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే.ఈ చిత్రం ప్రెస్ మీట్ లో స‌ల్మాన్ ఖాన్ ను మీడియా మిత్రులు .. పెళ్లి గురించి అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఫ‌న్నీ స‌మాధానాలు ఇచ్చారు.

ఇప్ప‌టి జ‌న‌రేష‌న్ కు పెళ్లి అనేది ప‌ర్మ‌నెంట్ ఇష్యూ కాద‌న్నారు. మీరు ఎప్పుడు డ‌బుల్ అవుతారు..( పెళ్లి అయితే ఇద్ద‌రు అవుతార‌నే అర్ధంలో అడిగిన ప్ర‌శ్న‌) అని ఒక జ‌ర్న‌లిస్ట్ అడిగిన ప్ర‌శ్న‌కు స‌ల్మాన్.. నేను మైనే ప్యార్ కియా నుంచి డ‌బులు అవుతునే వున్నానంటూ ఆన్స‌ర్ ఇచ్చారు. మ‌రో జ‌ర్న‌లిస్ట్ అడిగ‌న ప్ర‌శ్న‌కు .. న‌న్ను టెంప‌ర‌రీ మ్యారేజ్ చేసుకోమంటారా..? ప‌ర్మ‌నెంట్ మ్యారేజ్ చేసుకో మంటారా..? నాకు అయితే ప‌ర్మ‌నెంట్ మ్యారేజ్ మీద న‌మ్మ‌కం లేదంటూ న‌వ్వుతూ స‌మాధానాలు ఇచ్చారు. త‌న‌కు ప్రేమ మీద కూడా న‌మ్మ‌కం లేద‌ని చెప్పారు.. అవునులే నిత్య ప్రేమికుడికి ప్ర‌త్యేకంగా ప్రేమ అంటే ఇష్టం ఉండాల్సిన ప‌ని ఏముందిలే క‌దా..! అన్న‌ట్లు రుమెనియ బ్యూటీ తో డేటింగ్ వ్య‌వ‌హారం ఇంకా సాగుతూనే ఉందిగా అంటున్నారు ఆయ‌న స‌న్నిహితులు.!

First Published:  30 Sep 2015 7:00 AM GMT
Next Story