Telugu Global
Others

పది పాసైతే.. ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీలో అనధికారికంగా డ్రైవర్ కమ్ కండక్టర్‌గా పనిచేస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. పదో తరగతి పాసై డ్రైవరుగా పనిచేస్తున్న ప్రతిఒక్కరూ ఇక నుంచి డ్రైవర్ కమ్ కండక్టర్‌గా కొనసాగవచ్చని నిబంధనలో మార్పు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ ఉత్తర్వులు జారీచేశారు. రవాణాశాఖ నిబంధనల్లోని 72 ఏలో ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ ఉత్తర్వులు టీఎస్ ఆర్టీసీలో స్టేజీ క్యారేజీ బస్సులు నడిపే డైవర్లకు ఉపయోగపడుతుంది. కొత్తగా సవరించిన […]

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీలో అనధికారికంగా డ్రైవర్ కమ్ కండక్టర్‌గా పనిచేస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. పదో తరగతి పాసై డ్రైవరుగా పనిచేస్తున్న ప్రతిఒక్కరూ ఇక నుంచి డ్రైవర్ కమ్ కండక్టర్‌గా కొనసాగవచ్చని నిబంధనలో మార్పు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ ఉత్తర్వులు జారీచేశారు. రవాణాశాఖ నిబంధనల్లోని 72 ఏలో ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ ఉత్తర్వులు టీఎస్ ఆర్టీసీలో స్టేజీ క్యారేజీ బస్సులు నడిపే డైవర్లకు ఉపయోగపడుతుంది. కొత్తగా సవరించిన నిబంధనల వల్ల ఆర్టీసీలో పనిచేస్తున్న సుమారు 17 వేల మంది డ్రైవర్లు లబ్ధిపొందనున్నారు.

First Published:  29 Sep 2015 1:11 PM GMT
Next Story