Telugu Global
Cinema & Entertainment

బ్రూస్ లీ షూట్‌లో చిరు స్పెషల్ అట్రాక్షన్ !

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న బ్రూస్ లీ సినిమా షూటింగ్ లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. సినిమాలో చిరంజీవి కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. రామ్ చరణ్ తో కలిసి గ్రౌండ్ లో గుర్రంపై ఉన్న స్టిల్స్ ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. అదే సమయంలో మాస్ గెటప్ లో నడుస్తున్న మరో ఫొటో కూడా అభిమానులను కనివిందు చేస్తోంది. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న బ్రూస్ లీ చిత్రంలో చిరంజీవి 3 నుంచి 15 నిమిషాల […]

బ్రూస్ లీ షూట్‌లో చిరు స్పెషల్ అట్రాక్షన్ !
X

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న బ్రూస్ లీ సినిమా షూటింగ్ లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. సినిమాలో చిరంజీవి కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. రామ్ చరణ్ తో కలిసి గ్రౌండ్ లో గుర్రంపై ఉన్న స్టిల్స్ ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. అదే సమయంలో మాస్ గెటప్ లో నడుస్తున్న మరో ఫొటో కూడా అభిమానులను కనివిందు చేస్తోంది. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న బ్రూస్ లీ చిత్రంలో చిరంజీవి 3 నుంచి 15 నిమిషాల పాటు కనిపించనున్నట్టు తెలుస్తోంది.

తమ అభిమాన నటుడు వెండి తెరపై ఎప్పుడు కనిపిస్తాడా అని ఎదురు చూసిన మెగా అభిమానుల కోరిక బ్రూస్ లీ మూవీ రూపంలో తీరింది. ఇక ఈ సినిమా ఆడియో అక్టోబర్ 2న మెగా అభిమానుల సమక్షంలో వైభవంగా జరగనుంది. తమన్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడని టాలీవుడ్ టాక్. చరణ్ కు జోడీగా ఈసినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. దసరా కానుకగా విడుదల కానున్న ఈ సినిమాకు టాలీవుడ్ లో ఇప్పటికే విపరీతమైన క్రేజ్ వచ్చింది.

మెగాస్టార్ చిరంజీవి 148వ మూవీ శంకర్ దాదా జిందా బాద్ కాగా.. ఆతర్వాత మగధీరలోనూ స్పెషల్ పాత్రలో కనిపించాడు చిరు. మగధీరలో చిరంజీవి పాత్ర 3 నిమిషాల పైనే ఉంటుంది. దీంతో అభిమానులు మగధీరని 149వ సినిమాగా లెక్కలోకి తీసుకున్నారు. ఆతర్వాత 150వ సినిమా ప్రత్యేకంగా ఉంటుందని జోరుగా ప్రచారం జరిగింది. ఓవైపు సినిమాకు సంబంధించిన చర్చలు, ఊహాగానాలు నడుస్తుండగానే మరోసారి చరణ్ నటిస్తున్న బ్రూస్ లీ మూవీలో చిరు నటించి 150వ సినిమాను పూర్తి చేసినట్టైంది.

First Published:  1 Oct 2015 9:55 AM GMT
Next Story