Telugu Global
International

ఐ ఫోన్ కోసం న‌గ్న నిర‌స‌న‌!

చైనాలో యువ‌త ఐ-ఫోన్ కోసం వెర్రెత్తిపోతున్నారు. రెండు వారాల క్రితం ఐఫోన్ 6 ఎస్ విడుద‌లైన సంద‌ర్భంగా దాన్ని కొనేందుకు ఇద్ద‌రు యువ‌కులు  త‌మ కిడ్నీల‌నే అమ్ముకోవ‌డానికి సిద్ధ‌ప‌డ్డ ఘ‌ట‌న మ‌ర‌వక‌ముందే అలాంటిదో మ‌రో ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈసారి త‌న బాయ్‌ఫ్రెండ్ ఆపిల్ 6 ఎస్ ఫోన్ కొనివ్వ‌లేద‌ని ఓ యువ‌తి నిర‌స‌న‌కు దిగింది. మాటామాటా పెరిగింది. అంతే! ఒక్క‌సారిగా స‌హ‌నం కోల్పోయింది. బాగా ర‌ద్దీగా ఉన్న ప్రాంత‌మ‌న్న విచ‌క్ష‌ణ మ‌రిచి త‌న ఒంటిపై ఉన్ […]

చైనాలో యువ‌త ఐ-ఫోన్ కోసం వెర్రెత్తిపోతున్నారు. రెండు వారాల క్రితం ఐఫోన్ 6 ఎస్ విడుద‌లైన సంద‌ర్భంగా దాన్ని కొనేందుకు ఇద్ద‌రు యువ‌కులు త‌మ కిడ్నీల‌నే అమ్ముకోవ‌డానికి సిద్ధ‌ప‌డ్డ ఘ‌ట‌న మ‌ర‌వక‌ముందే అలాంటిదో మ‌రో ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈసారి త‌న బాయ్‌ఫ్రెండ్ ఆపిల్ 6 ఎస్ ఫోన్ కొనివ్వ‌లేద‌ని ఓ యువ‌తి నిర‌స‌న‌కు దిగింది. మాటామాటా పెరిగింది. అంతే! ఒక్క‌సారిగా స‌హ‌నం కోల్పోయింది. బాగా ర‌ద్దీగా ఉన్న ప్రాంత‌మ‌న్న విచ‌క్ష‌ణ మ‌రిచి త‌న ఒంటిపై ఉన్ దుస్తులు విప్పి నానా యాగీ చేసింది. ఈ వీడియో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైర‌ల్‌లా పాకిపోయింది. ఫోన్ కోసం ఆడ‌దాన్ని అన్న సంగ‌తి మ‌రిచి దుస్తులు విప్ప‌డ‌మేంట‌ని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

ఇదంతా నిజ‌మేనా!

ఆపిల్ ఫోన్ కోసం చైనాలో చోటుచేసుకుంటున్న సంఘ‌ట‌న‌లు నిజ‌మేనా? లేక కావాల‌ని చేసిన‌వా? అన్న చ‌ర్చ మొద‌లైంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఐ-ఫోన్ విక్ర‌యాలు జోరుగా సాగుతున్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి ఆపిల్‌కు చైనాలో అంత‌గా మార్కెట్ లేదు. అక్క‌డ చ‌వ‌క‌గా ఆపిల్ త‌ర‌హా ఫీచర్లు అందించే ఫోన్ కంపెనీలు లెక్క‌కు మిక్కిలి ఉన్నాయి. దీంతో చైనా వాసులు ఆపిల్ ను ఇంత‌కాలం లైట్ తీసుకున్నారు. కొంత‌కాలంగా వారికి ఆపిల్‌పై మోజు పెరిగింది. 2015 తొలి త్రైమాసికంలో చైనాలో పెరిగిన ఆపిల్ విక్ర‌యాలే ఇందుకు నిద‌ర్శ‌నం. రెండు వారాల కింద ఆపిల్ 6 ఎస్ వ‌ర్ష‌న్ రిలీజ్ చేసింది. ఆ స‌మ‌యంలో ఇద్ద‌రు యువ‌కులు ఫోన్ కొనేందుకు కిడ్నీలు అమ్ముకునేందుకు సిద్ధ‌మ్యాయ‌ర‌ని వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా యువ‌తి దుస్తులు విప్పిన సంఘ‌ట‌న కూడా ఈ త‌ర‌హాదే! ఘ‌ట‌న చైనాలో ఎక్క‌డ జ‌రిగిందో తెలియ‌దు! అస‌లు వారిద్ద‌రు గొడ‌వ‌ప‌డ్డ‌ది ఎందుకోస‌మో క్లారిటీ లేదు. ఇదంతా చైనా యువ‌త‌కు గాలం వేసే మార్కెట్ ట్రిక్ అని కొంద‌రు భావిస్తున్నారు

First Published:  30 Sep 2015 1:06 PM GMT
Next Story