Telugu Global
Others

రాజధాని శంకుస్థాపనకు జగన్ ను ఆహ్వానిస్తారా?

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ దసరాకు డబుల్ ధమాకా అంటోంది టీడీపీ ప్రభుత్వం. కొత్త రాజధాని నిర్మాణానికి అక్టోబర్ 22న అంటే విజయదశమి రోజు శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోడీని ఆహ్వానించారు. ఆయన కూడా వస్తున్నట్టు అధికారికంగా ప్రకటన వచ్చింది. ప్రొటోకాల్ ప్రకారం ఇతర దేశాధ్యక్షులను ఆహ్వానించే అధికారం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి లేకపోయినా అవన్నీ పట్టించుకోకుండా  సింగపూర్, జపాన్ ప్రధానులనూ చంద్రబాబు ప్రత్యేకంగా ఆహ్వానించారు. కేంద్ర మంత్రులతోపాటు ఇతర రాష్ట్రాల సీఎంలు, పలువురు ప్రముఖులకు […]

రాజధాని శంకుస్థాపనకు జగన్ ను ఆహ్వానిస్తారా?
X
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ దసరాకు డబుల్ ధమాకా అంటోంది టీడీపీ ప్రభుత్వం. కొత్త రాజధాని నిర్మాణానికి అక్టోబర్ 22న అంటే విజయదశమి రోజు శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోడీని ఆహ్వానించారు. ఆయన కూడా వస్తున్నట్టు అధికారికంగా ప్రకటన వచ్చింది. ప్రొటోకాల్ ప్రకారం ఇతర దేశాధ్యక్షులను ఆహ్వానించే అధికారం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి లేకపోయినా అవన్నీ పట్టించుకోకుండా సింగపూర్, జపాన్ ప్రధానులనూ చంద్రబాబు ప్రత్యేకంగా ఆహ్వానించారు. కేంద్ర మంత్రులతోపాటు ఇతర రాష్ట్రాల సీఎంలు, పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపాలని చంద్రబాబు భావిస్తున్నారు.
రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని ఇప్పటికే అధికార పండుగగా గుర్తిస్తూ ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. ఇదంతా గమనిస్తున్న ప్రజల్లో మాత్రం కొత్త ఆలోచనలు రేకెత్తుతున్నాయి. కనీసం రాజధాని శంకుస్థాపనకైనా వైఎఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ ను ఆహ్వానిస్తారా? అన్న చర్చ విస్తృతంగా జరుగుతోంది. నిజానికి గతంలో అమరావతి భూమి పూజ సందర్భంగా ఎంతో ఆర్భాటాలకు పోయిన ప్రభుత్వం.. ఆ కార్యక్రమం కేవలం తెలుగుదేశం పార్టీ స్వంత వ్యవహారం అన్నట్టు వ్యవహరించింది. కేవలం చంద్రబాబు కుటుంబం, మంత్రులు, ఆపార్టీ ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులే హడావుడి చేశారు.
మరి ఇప్పుడు అమరావతి శంకుస్థాపన కార్యక్రమం సమయంలోనైనా ప్రతిపక్ష నేతగా జగన్ ను గౌరవిస్తారా? గతంలోలాగే వ్యవహరిస్తారా? అన్నది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ చర్చ జరుగుతోంది. అయితే ఇటీవల గుంటూరు జిల్లాలోని కొన్ని గ్రామాల ప్రజలు భూసమీకరణకు ఒప్పుకోకపోవడం వెనుక వైసీపీ నాయకుల హస్తం ఉందని భావిస్తున్న ప్రభుత్వం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలను కానీ, ప్రతిపక్ష నేతనుగానీ పిలుస్తుందా? అన్న చర్చ నడుస్తోంది.
అయితే దేశ ప్రధాని హాజరవుతున్న సమయంలో ప్రొటోకాల్ ప్రకారమైనా ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్ ను ఆహ్వానించాల్సి ఉంటుంది. అయితే మరి జగన్ ను చంద్రబాబే ఆహ్వానిస్తారా? లేక గతంలో లాగ యనమలతోనో మరో మంత్రితోనో ఓ ఫోన్ చేసి పిలిచాం అన్నట్టు వ్యవహరిస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వ్యహారంపై మరికొన్ని రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
First Published:  1 Oct 2015 1:22 AM GMT
Next Story