లోఫ‌ర్ మారిపోతాడు..!

వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లోఫర్’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సి.కళ్యాణ్ నిర్మాత. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఫెమినా మిస్ ఇండియా 2013 రన్నరప్ దిషా పతాని ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి జోడీగా నటిస్తోంది. ఈ చిత్రానికి డిఫెరెంట్ టైటిల్ పెట్టానని చెప్తున్న పూరి జగన్నాథ్ ..తాజాగా టైటిల్ మార్చారని సమాచారం. లోఫర్ అనే టైటిల్ ని వద్దనకుని మా అమ్మ మహాలక్ష్మి అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు వినికిడి. ఈ విషయమై అతి త్వరలో అధికారికంగా ప్రకటన వచ్చే అవకాసం ఉంది. ఈ చిత్రంలో అమ్మ పాత్రలో రేవతి కనిపించనుంది.
చాల కాలం త‌రువాత  పూరీ జ‌గ‌న్నాధ్ ఒక ఫ్యామిలీ  సెంటి మెంట్ చిత్రం చేస్తున్నారు.    గ‌తంలో ఇట్లు శ్రావని సుబ్ర‌మ‌ణ్యం,    అమ్మ నాన్న ఓత‌మిళ‌మ్మాయి వంటి  ఫ్యామిలీ , సెంటిమెంట్ చిత్రాలు చేసి మెప్పించాడు. ఆ త‌రువాత పూర్తి వాణిజ్య చిత్రాలు చేయ‌డంలో బిజీ అయ్యారు. ఈ మ‌ధ్య ఎన్టీఆర్ తో చేసిన టెంప‌ర్ సినిమా  కూడా  మంచి సెంట్ మెంట్ వున్న చిత్ర‌మే.  లోఫ‌ర్ అనే టైటిల్ పెట్ట‌డంతో  సినిమాకు ఫ్యామిలీ ఆడియ‌న్స్ వ‌చ్చే చాన్స్ లేద‌ని ..అందుకే టైటిల్ మార్చే ఆలోచ‌న చేస్తున్న‌ట్లు టాక్.