Telugu Global
Cinema & Entertainment

బాహుబలిని పులి బీట్ చేస్తుందా..

మొత్తం సౌత్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులకెక్కింది బాహుబలి సినిమా. దాదాపు 6 వందల కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది బాహుబలి సినిమాకి. ఇప్పుడా సినిమాను టార్గెట్ చేస్తూ పులి అనే సినిమా థియేటర్లలోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కొద్దిసేపటి కిందట గ్రాండ్ గా విడుదలైన పులి సినిమా కచ్చితంగా బాహుబలిని క్రాస్ చేస్తుందని కొందరు అంచనా వేస్తుంటే.. మరికొందరు ఆ సినిమాలో లోపాలు వెదికే పనిలో పడ్డారు. ఇంతకీ విజయ్ హీరోగా నటించిన పులి […]

బాహుబలిని పులి బీట్ చేస్తుందా..
X
మొత్తం సౌత్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులకెక్కింది బాహుబలి సినిమా. దాదాపు 6 వందల కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది బాహుబలి సినిమాకి. ఇప్పుడా సినిమాను టార్గెట్ చేస్తూ పులి అనే సినిమా థియేటర్లలోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కొద్దిసేపటి కిందట గ్రాండ్ గా విడుదలైన పులి సినిమా కచ్చితంగా బాహుబలిని క్రాస్ చేస్తుందని కొందరు అంచనా వేస్తుంటే.. మరికొందరు ఆ సినిమాలో లోపాలు వెదికే పనిలో పడ్డారు. ఇంతకీ విజయ్ హీరోగా నటించిన పులి సినిమాకు బాహుబలిని బీట్ చేసే సత్తా ఉందా అనేది ఇప్పుడు బేసిక్ క్వశ్చన్. దీనికి అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే.. తమిళనాడుతో పాటు ఓవర్సీస్ లో విజయ్ కు బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. తను నటించిన ఎన్నో సినిమాలతో ఇప్పటికే వంద కోట్ల వసూళ్లు సాధించాడు విజయ్. మరోవైపు సినిమాలో కథ, కథనం, గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇంకోవైపు శ్రీదేవి రీఎంట్రీ, శృతిహాసన్ అందాలు అదనపు ఆకర్షణగా నిలిచాయి. వీటికి తోడు భారీ సంఖ్యలో స్క్రీన్స్ పులి సినిమాకు కేటాయించారు. ఈ లెక్కలన్నీ చూస్తుంటే.. బాహుబలిని పులి క్రాస్ చేయడం పెద్ద సమస్య కాదనిపిస్తోంది. అయితే బాహుబలితో పోలిస్తే పులికి ఒకేఒక్క డ్రాబ్యాక్ ఉంది. కరణ్ జోహార్ చలవతో బాహుబలి సినిమా బాలీవుడ్ లోకూడా బాగానే ఆడింది. పులి సినిమాకు ఆ స్కోప్ తక్కువ. కేవలం శ్రీదేవి యాంగిల్ లోనే బాలీవుడ్ జనాలు పులి సినిమాను చూస్తే చూడాలి.
First Published:  30 Sep 2015 7:02 PM GMT
Next Story