బాపట్ల వ్యవసాయ కాలేజీ నిరవధిక మూసివేత

బాపట్ల వ్యవసాయ కళాశాలను నిరవధికంగా మూసివేస్తున్నట్టు ప్రకటించారు. ఓ విద్యార్థి ఆత్మహత్య జరిగిన నేపథ్యంలో విద్యార్దులు ఆదోళన చేస్తున్నందున కళాశాల డీన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం మద్దుకూరి సూర్యారావు అనే విద్యార్ది ఆత్మహత్య చేసుకున్నాడు. అద్యాపకుడి వేధింపుల వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్దులు ఆరోపిస్తున్నారు. దీనిని విచారించడానికి నియమించిన కమిటీ సభ్యుల నివేదికను తమకు చూపించాలని కోరుతూ విద్యార్దులు ఆందోళన దిగారు. వేధింపులకు కారకుడైన అద్యాపకుడిపై చర్య తీసుకోవాలని వారు పట్టుబడుతున్నారు. గత రెండు రోజులుగా వారు క్లాసులకు రావడం లేదు. ఈ నేపద్యంలో కాలేజీ, హాస్టల్‌ను మూసి వేస్తున్నట్లు డీన్ ప్రకటించారు.