దటీజ్‌ కమల్‌ హాసన్‌!

హెచ్‌.ఐ.వి.తో బాధ పడుతున్న వారిని ఆదుకునేందుకు సినీ హీరో కమల్‌ హాసన్‌ తనకంటూ ఓ చరిత్రను లిఖించుకున్నారు. ఇప్పటివరకు ఏ సినీ హీరో ఇవ్వనంత విరాళం ఇచ్చి తన పెద్ద మనసును చాటుకున్నారు. ఆయన ఇచ్చినంత విరాళం బహుశా భారతదేశ సినీ చరిత్రలో ఏ ఒక్కరూ ఇంత భూరి విరాళం ఇచ్చి ఉండకపోవచ్చు. చిన్నా పెద్దా తేడా లేకుండా ఎంతోమంది హెచ్‌.ఐ.వి. బారిన పడి ‘చితికి’పోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇదే ఆయన మనసును కదిలించింది. తమిళనాడులో ఈ పరిస్థితిని చూసిన ఆయన చలించిపోయారు. హెచ్‌.ఐ.వి. బాధితుల సేవలో పునీతమవుతున్న పి.టి.పి. అనే స్వచ్ఛంద సంస్థకు తన విరాళాన్ని అందించారు. ఈ స్వచ్ఛంద సంస్థలో కమల్‌హాసన్‌ కూడా భాగస్వామిగా ఉన్నారు. హలో ఎఫ్‌.ఎం. రేడియో స్టేషన్‌, కమల్‌ హాసన్‌ సంయుక్తంగా ఈ స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు. ఇంతకీ విరాళం ఎంతో చెప్పలేదు కదూ… అక్షరాలా పదహారు కోట్ల రూపాయలు…! ఈ ఫిగర్‌ చూస్తే ఎవరికైనా వావ్‌… అనిపించకమానదు. కమల్‌ హాసన్‌ను అభినందించకుండా ఉండలేదు. ఎంతో మంది విరాళాలిచ్చే వారికి ఆయన స్ఫూర్తిగా మిగలడం ఖాయం.