బీహార్‌లో ఈసారి రెండుసార్లు దీపావళి: మోడి

బీహార్‌ ప్రజలు ఈసారి రెండుసార్లు దీపావళి పండుగ చేసుకుంటారని ప్రధానమంత్రి నరేంద్ర మోడి అన్నారు. ఒకటి రెగ్యులర్‌గా వచ్చే దీపావళి పండుగయితే మరొకటి ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ గెలిచి తర్వాత వచ్చే దీపావళి అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఇప్పటికే పలు సమస్యలతో సతమతమవుతుందని, బీహార్‌ అభివృద్ధి ఒక్క బీజేపీతోనే సాధ్యమవుతందని ఆయనన్నారు. బీహార్‌లోని బంకాలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ప్రజలు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడం తనకెంతో సంతోషాన్నిస్తుందని, ఇది బీజేపీ గెలుపును సూచిస్తుందని మోడి అన్నారు. రాష్ట్రంలో కొందరు కుల రాజకీయాలు చేస్తున్నారని లాలూ, నితీష్‌ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.